Friday, March 29, 2024
- Advertisement -

చన్నీటితో స్నానం చేస్తే మంచిదా?

- Advertisement -

చాలా మంది చన్నీళ్ల స్నానమంటేనే భయపడుతారు. ఒంట్లో వణుకు ఎందుకు అని దీనికి దూరంగా ఉంటారు. చలికాలంలో ప్రతి ఒక్కరు వేన్నీళ్ల స్నానం చేసేందుకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే అయితే వేడి నీటి కంటే చన్నీళ్ల స్నానంతోనే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని ‘హైడ్రో థెరపీ’ వైద్యులు చెబుతున్నారు.

అప్పట్లో  ‘నీటితో వైద్యం (హైడ్రో థెరపీ)’ని డాక్టర్లు మందులకు బదులుగా రోగాలను నయం చేయడానికి వాడేవారు. ఈ పద్ధతిలో చల్లగా ఉన్న నీటినే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే నేడు అనేక ‘స్పా’లలో సైతం చన్నీటినే వాడుతున్నారు. క్రమం తప్పకుండా నిత్యం చల్లని నీటితో స్నానం చేస్తే అనేక అనారోగ్యాలకు కూడా దూరం కావచ్చు.

* చన్నీటి స్నానం ఒత్తిడి, డిప్రెషన్ తదితరాలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యం చక్కబడుతుంది. చర్మకాంతి పెరిగి యుక్త వయస్సు ఉన్న వారిలాగా కనిపిస్తారు.

* శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణా సంఖ్య పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెటబాలిజం ప్రక్రియ కూడా వేగం పుంజుకుంటుంది.

* చర్మం నుంచి హానికరమైన రసాయనాలు తొలగిపోతాయి. వేడి నీరు చర్మ రంధ్రాలను తెరిస్తే దానికి సరిగ్గా వ్యతిరేకంగా చల్లని నీరు పనిచేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుంటే అక్కడ మురికి పేరుకోదు. దీంతో చర్మం శుభ్రంగా ఉంటుంది. మొటిమలు వంటివి రావు. చన్నీటి స్నానం వెంట్రుకలను నల్లగా చేసి వాటికి మెరిసే గుణాన్ని ఇస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు రాకుండా ఉంటుంది.

* ఎండోక్రిన్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీంతో హార్మన్లు సరిగ్గా తయారవుతాయి. పురుషులు వేడి నీటి స్నానం చేస్తే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది.

* చల్లని నీటితో స్నానం శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. రోజంతా మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం లభిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -