Friday, April 19, 2024
- Advertisement -

హ‌గ్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

- Advertisement -

వాలంటైన్ వీక్ వ‌చ్చిందంటే చాలు.. రోస్ డే, ప్ర‌పోజ్ డే, హ‌గ్ డే.. ఇలా అన్ని జ‌రుపుకుంటాం. కానీ అన్ని ప్రియురాలితోనే కాదు.. కొన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతోనూ సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు. ఇది వారి మ‌ధ్య‌ అన్యోన్యతను పెంచుకోవడానికి ఉప‌యోగించుకోవ‌చ్చు.

వాలంటైన్‌ వీక్‌… మీ సన్నిహితుల పట్ల మీ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఉప‌యోగించండి. వాలెంటైన్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12న హగ్ డే జరుపుకొంటున్నారు. అయితే ఈ కౌగిలింత‌తో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే జరుపుకోవడం మీకు నచ్చకపోయినా.. హగ్‌ వల్ల కలిగే ఫలితాలు తెలిస్తే తప్పకుండా మీకు ఇష్టమైన వారి కౌగిలింతలో ఒదిగిపోతారు.

  • కౌగిలింత గుండె ఆరోగ్యానికి మంచిది. చేతిలో చేతిని వేసి ఉంచడం, కౌగిలించుకోవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందనల రేటు తగ్గుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
  • కౌగిలింత వల్ల అనారోగ్యం బారిన పడే ముప్పు కూడా తగ్గుతుంది. ఛాతి భాగంలో కలిగే మృదువైన ఒత్తిడి వల్ల తైమస్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
  • హగ్గింగ్ వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందం పెరుగుతుంది. కౌగిలింత హార్మోన్ అని కూడా పిలిచే ఆక్సిటోసిన్ ప్రభావం మహిళలపై ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
  • కౌగిలింత వల్ల ఒత్తిడి తగ్గి భరోసా లభిస్తుంది. కంఫర్ట్‌గా ఫీలవడానికి ఉపకరిస్తుంది.
  • హగ్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాస లేమితో సతమతం అవుతున్న వారిలో ట‌చ్ ఎంతో ప్రభావం చూపుతోంది.
  • మూడ్ బాగోలేనప్పుడు ఫ్రెండ్ లేదా ఇష్టపడే వ్యక్తి హగ్ చేసుకోవడం వల్ల మీ మూడ్ మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మీ ఇష్టమైన వారి హ్యాపీగా హత్తుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -