Thursday, April 18, 2024
- Advertisement -

బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ః తోక పత్రిక యజమానికి తలంటిన చంద్రబాబు

- Advertisement -

ప్రచార మాయతో, అబద్ధపు మాటలతో జనాలను ఆకట్టుకోవడంలో చంద్రబాబును మించిన నాయకుడు మరొకడు లేరు. ఈ విషయం రాజకీయాలను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కాకపోతే తమ వర్గం వాడని కొందరు, అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించుకోవడానికి అవకాశాలు చూపిస్తున్నాడని కొందరు చంద్రబాబును సమర్థిస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కోట్లాది రూపాయల ప్యాకేజ్‌లు తీసుకుంటూ ఉండే ఎల్లో మీడియా భజన అయితే చెప్పనవసరం లేదు. అయితే ఎంతటి అబద్ధాల కోట కట్టినా అప్పుడప్పుడూ నిజాలు మాత్రం బయటికి వస్తూనే ఉంటాయి. చంద్రబాబు అబద్ధాల ప్రచారాన్ని అదే స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో టిడిపి నేతలు, ఎల్లో మీడియా అప్పుడప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి చంద్రబాబుకి బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ అయ్యేలా చేస్తూ ఉంటారు.

హోదా వేస్ట్ అని చెప్పి పది రోజుల క్రితం వరకూ చంద్రబాబు మాట్లాడినంత కాలం ప్రత్యేక హోదా శుద్ధ దండగ అని ఎన్నో వ్యాసాలు రాశాడు తోక మీడియా అధినేత. అంతకుముందు 2014 ఎన్నికల సమయంలో మాత్రం హోదా ఎంత గొప్పదో……చంద్రబాబుకు, రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్న మోడీకి ఓట్లేస్తే హోదా ఎలా వస్తుందో కూడా ఇదే మీడియా అధినేత చాలానే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ హోదా బెస్ట్ అని చంద్రబాబు చెప్పడంతో మరోసారి తన పంథా మార్చుకుని హోదా కోసం అందరూ పోరాడాలన్న శైలిలో రాసేస్తోంది తోక మీడియా. నంబర్ ఒన్ మీడియాది కూడా అదే తీరు.

అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు తప్ప ఇంకెవ్వరూ హోదా కోసం పోరాడడం లేదు అని దబాయిస్తున్నారు. నాలుగేళ్ళుగా పోరాటం చేస్తున్న జగన్ పోరాటాన్ని కూడా హైజాక్ చేసి….చంద్రబాబుకే ఆ క్రెడిట్ కూడా దక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సొసైటీలో ఉన్న అన్ని రకాల ప్రజల కంటే చంద్రబాబే ఎక్కువ పోరాటం చేస్తున్నాడు అని చెప్పాలనుకున్నారు. అందేకే తోక మీడియా అధినేత బాబు రాజేంద్రప్రసాద్‌కి సినిమా వాళ్ళు హోదా కోసం పోరాడడం లేదని విమర్శలు చేయమని చెప్పి బాబు రాజేంద్రప్రసాద్‌కి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్‌ని గుడ్డిగా చదివేశాడు బాబూ రాజేంద్రప్రసాద్. ఆ వెంటనే తోక మీడియాలో వార్తలు వండేశారు.

అయితే ఇక్కడే పచ్చ బ్యాచ్ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పోసాని కృష్ణమురళి లాంటి గట్స్ ఉన్న జనాలు……..ఆ మధ్య ప్రత్యేక హోద కోసం పోరాటం చేసిన సినిమా జనాలను ఎందుకు అరెస్ట్ చేయించావు అని చంద్రబాబుని నిలదీశారు. హోదా ఉద్యమం చేస్తున్న వాళ్ళను అరెస్ట్‌లు చేయించి, హింసించి ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబుకు ఇంకొకళ్ళను అనే అర్హత ఉందా? అని నిలదీశాడు పోసాని. ఏకంగా చంద్రబాబును అబద్ధాలకోరుగాను, పొలిటికల్ బ్రోకర్‌గానూ తేల్చేశాడు.

పోసాని దెబ్బకు పదిరోజులుగా ప్రత్యేక హోదా పోరాట వీరుడిగా తనను తాను చూపించుకోవాలన్న తాపత్రయంలో అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్న బాబుకు దిమ్మతిరిగింది. హోదా వేస్ట్, హోదా కోసం రోడ్డెక్కితే అరెస్ట్‌లే అన్న చంద్రబాబు మాటలన్నీ జనాలకు మళ్ళీ గుర్తుకురావడంతో బాబు గతుక్కుమన్నాడు. తన కోపం మొత్తం తోక మీడియా అధినేతపై, బాబూ రాజేంద్రప్రసాద్‌పై చూపించాడు. జగన్ తనను ఓడించడం తర్వాత……అంతకంటే ముందు మీరే జనాల ముందు నన్ను బఫూన్‌ని చేసేలా ఉన్నారే అని వాపోయాడు చంద్రబాబు. ఇప్పుడు ఇదే విషయం పొలిటికల్ జర్నలిస్టుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఎంతైనా ఎంతో కష్టపడి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తూ ఉంటే………..నమ్ముకున్నవాళ్ళు బాబు కష్టాన్ని నట్టేట్లో ముంచేస్తూ ఉంటే ఆ మాత్రం కోపం రాదా? అని చంద్రబాబుపై సానుభూతి చూపిస్తున్నారు కొంతమంది జర్నలిస్టులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -