Friday, March 29, 2024
- Advertisement -

బీజేపీ.. ఓ నియంతృత్వ రాజ్యం..

- Advertisement -

బీజేపీ.. ఇప్పుడు ఇద్దరి చేతుల్లోనే ఉంది. మోడీషాలే దానికి కర్త, కర్మ, క్రియలు.. వారు లేనిదే పార్టీలేదు.. ప్రభుత్వం లేదు.. 2014 మోడీని ప్రధాన మంత్రిగా ఫోకస్ చేశారు నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్.. దీనికి అలిగిన బీజేపీ పెద్దాయన అద్వానీ పార్టీకి రాజీనామా చేయగా తిరస్కరించి ఒప్పించాడు రాజ్ నాథ్.. అప్పుడు రాజ్ నాథ్ పై గౌరవంతో మోడీ తర్వాతి స్థానం హోంమంత్రి పదవిని ఆయనకే ఇచ్చాడు మోడీ..

ఐదేళ్లు గడిచాయి.. మోడీషాలు మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వారు ఆడిందేఆట.. పాడిందే పాటగా ఉంది. అద్వానీ, మురళీ మనోహర్ జోహీ సహా సీనియర్లందరినీ సైడ్ చేసిన మోడీషాలు .. ఇప్పుడు 2019లో గెలిచాక తమను ఇంతవాల్లను చేసిన రాజ్ నాథ్ సింగ్ ను కూడా పక్కనపెట్టి రక్షణమంత్రి పదవికే పరిమితం చేయడం విస్తుగొలుతోంది.

తాజాగా కేబినెట్ కమిటీల వ్యవహారాల్లో రాజ్ నాథ్ సింగ్ కు ఘోర అవమానాన్ని మూటగట్టారు. హోంమంత్రి అయిన అమిత్ షాకు 8 కేబినెట్ కమిటీల్లో చోటివ్వగా.. ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్ కు 7, పీయూష్ గోయల్ కు 5 కేబినెట్ కమిటీల్లో చోటిచ్చారు. ఇక రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేవలం రెండింటికే పరిమితం చేశారు. దీనిపై అలిగిన రాజ్ నాథ్ రాజీనామాకు ప్రయత్నించారని.. ఆర్ ఎస్ ఎస్ జోక్యం చేసుకొని మరో 4 కమిటీల్లో స్థానం కల్పించారని సమాచారం..

ఇలా సీనియర్ల అయిన అందరినీ సాగనంపిన మోడీషాలు ఈ ఎన్నికల వేళ విదేశాంగ మంత్రిగా చేసిన సుష్మా స్వరాజ్ కు కూడా ఎసరు పెట్టారు. ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ ను లేపేయడానికి రెడీ అయ్యారు. ఇలా మోడీషాల ప్రాభవానికి బీజేపీ సీనియర్లందరూ కనుమరుగు అవుతుండడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -