Thursday, March 28, 2024
- Advertisement -

2014లో కెసీఆర్-జగన్ కుమ్మక్కు అన్నారు….. తర్వాత మీరే జతకట్టారు… ఇప్పుడు మోడీనా?

- Advertisement -

నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం తన సొంతం……. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిని అని తన డప్పు తానే కొట్టుకుంటూ ఉంటాడు చంద్రబాబు. అఫ్కోర్స్ కంటికి కనిపిస్తున్న నిజాలను కూడా అబద్ధపు మాటలతో మాయ చేయాలని చూస్తూ ఉంటాడు. బాబు అబద్ధాల విషయం పక్కనపెడితే అంతటి అనుభవజ్ఙుడు అయిన బాబు……..ఎన్నికల సమయంలో కూడా తన అనుభవం, పనితనం చూపించి ఓట్లు అడగొచ్చుగా అని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ బాబుకు అంత సీన్ ఎక్కడిది? తనతో పాటు తన భజన మీడియా, బ్యాచ్ అందరితో ప్రత్యర్థులపై విషం చిమ్మించడం, ఎన్నికల సమయానికి ఉపయోగపడే పొత్తులు పెట్టుకోవడం……ప్రజలకు ఎన్ని అబద్ధపు హామీలు అయినా ఇస్తూ గట్టెక్కేస్తూ ఉంటాడు.

2014లో మోడీ మేనియా చూసి పొత్తు పెట్టుకున్నాడు. పవన్ క్రేజ్ వాడుకున్నాడు. అబద్ధపు హామీలు, ఎన్నికల కుట్రల విషయం పక్కనపెడితే ఆ ఎన్నికల సమయానికి సీమాంధ్ర ప్రజలందరికీ కూడా కెసీఆర్‌పైన పీకల వరకూ కోపం ఉనింది. అందుకే చంద్రబాబు చాలా తెలివిగా కెసీఆర్-జగన్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేశాడు. బాబు భజన మీడియా కూడా అదే చెప్పింది. ప్రజలను నమ్మించింది. జగన్ అధికారంలోకి వస్తే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టలేడని…..కెసీఆర్‌తో కుమ్మక్కు అయి ఉన్నాడు కాబట్టి సీమాంధ్రకు దక్కాల్సిన వాటిని కూడా తెలంగాణాకు ఇచ్చేస్తాడన్న స్థాయిలో ప్రచారం చేసింది.

కానీ ఎన్నికలు అయ్యాక ఏమయింది? ఓటుకు కోట్లు కేసో….ఇంకోటో…..కారణాలేమైనా చంద్రబాబే కెసీఆర్‌తో కుమ్మక్కయ్యాడు. కెసీఆర్ ప్రాపకం కోసం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావులు తహతహలాడారు. కెసీఆర్‌తో సాన్నిహిత్యం కోసం యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత లాంటి టిడిపి నాయకులు తపించిపోయారు. కెసీఆర్‌తో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. పదేళ్ళు హక్కు ఉన్న హైదరాబాద్‌ని చంద్రబాబు వదిలేశాడు. తెలంగాణా ప్రభుత్వం నీళ్ళు తీసుకుపోతూ ఉంటే సీమాంధ్రకు రావాల్సిన నీటిని డిమాండ్ చేస్తే కెసీఆర్ ఓటుకు కోట్లు కేసు తీస్తాడని మౌనంగా ఉన్నాడు. విభజన చట్టం ప్రకారం తెలంగాణా నుంచి సీమాంధ్రకు రావాల్సిన ఒక్క ప్రయోజనాన్ని కూడా చంద్రబాబు రాబట్టలేకపోయాడు.

అదీ చంద్రబాబు. 2014 ఎన్నికల సమయంలో కెసీఆర్‌తో కుమ్మక్కయి జగన్ ఏం చేస్తాడని చెప్పి సీమాంధ్ర ప్రజలను భయపెట్టాడో అవన్నీ తాను చేశాడు. సీమాంధ్ర ప్రజలను అడ్డంగా ముంచాడు. ఇప్పుడు అదే సీమాంధ్రప్రజలకు మోడీపైన పీకల వరకూ కోపం ఉంది కాబట్టి మోడీతో కుమ్మక్కయిన జగన్ అని విషప్రచారం చేస్తున్నాడు. నిన్నటి వరకూ మోడీతో కుమ్మక్కయి హోదాతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలన్నింటినీ సర్వనాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు పునీతుడిలా కబుర్లు చెప్తున్నాడు. 2019 ఎన్నికల వరకూ జగన్-మోడీ కుమ్మక్కు అనే డ్రామానే చంద్రబాబు నడిపిస్తాడనడంలో సందేహం లేదు. కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు సరిపడా ఓట్లు, సీట్లు వస్తే మాత్రం మోడీతో కుమ్మక్కయి జగన్ ఏం చేస్తాడు అని ప్రచారం చేశాడో ……..అదే మోడీతో కుమ్మక్కయ్యి అవన్నీ చేస్తాడనడంలో సందేహం లేదు. రాజకీయ కుట్రలకు, కుతంత్రాలకు పేరెన్నికగన్న బుర్ర అది మరి. దాని నైజం ఎప్పటికీ అంతే అనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -