Friday, March 29, 2024
- Advertisement -

బాలీవుడ్ యంగ్ హీరోలు వాడే కార్లు ఇవే..!

- Advertisement -

బాలీవుడ్ నటులు ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం.. భారతదేశంలో కొత్త తరం బాలీవుడ్ నటులైన రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ కలిగి ఉన్న లగ్జరీ కార్లు ఏంటంటే..

రణవీర్ సింగ్ లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇతని గ్యారేజ్లో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఉరుస్‌తో పాటు, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మేబాచ్, రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌ కార్లు ఇతని దగ్గర ఉన్నాయి. తన 32 వ పుట్టినరోజున ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ ను కూడా కొన్నాడు.

హీరో విక్కీ కౌషల్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కార్లను కలిగి ఉన్నాడు.

టైగర్ ష్రాఫ్ తన బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌ను ప్రయాణాలలో మరియు షూట్‌లకు తీసుకెళ్లడానికి ఇష్టపడతాడు. ఈ కారు మాత్రమే కాకుండా ఎస్ఎస్ జాగ్వార్ 100 వంటి వాటిని కూడా వాడుతున్నాడు.

వరుణ్ ధావన్ కొన్ని ప్రత్యేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, ఆడి క్యూ 7, ల్యాండ్ రోవర్ ఎల్ఆర్ 3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ వంటి కార్లను కలిగి ఉన్నాడు.

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ భారతదేశంలో మసెరటి లెవాంటే ఎస్‌యూవీని కొనుగోలు చేసిన తొలి నటుడు. ఇతడు తన పుట్టినరోజున ఈ ప్రత్యేక ఎస్‌యూవీని గిఫ్ట్ గా పొందాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త భారతదేశంలో మసెరటి లెవాంటే ఎస్‌యువిని కలిగిన రెండవ వ్యక్తి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -