BSNL ఆఫర్ : అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు..!

1493
Bsnl Offers Unlimited Voice Calling Sms Benefits For Mtnl Users
Bsnl Offers Unlimited Voice Calling Sms Benefits For Mtnl Users

ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ సవరించింది. ఇప్పుడు ఈ ప్లాన్లు అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లభిస్తాయి. రూ.97 పైన ప్లాన్లకు ఇవి వర్తిస్తాయి. బీఎస్ఎన్ఎల్ చెన్నై సర్కిల్ అందించిన సర్క్యులర్ ప్రకారం మొత్తం 25 ప్లాన్లు, ప్రీపెయిడ్ వోచర్లు, ఫస్ట్ రీచార్జ్ కూపన్లకు వర్తించనుంది. ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్ ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కూడా రూ.99, రూ.104, రూ.349, రూ.447 ప్లాన్లపై ఈ ఆఫర్ వర్తించనుంది.

ఈ ప్లాన్లపై రోజుకు 250 నిమిషాలు లభించనున్నాయి. ఎంటీఎన్ఎల్ రోమింగ్ ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు రూ.97, రూ.118, రూ.187, రూ.199, రూ.247, రూ.298, రూ.349, రూ.399, రూ.447, రూ.499, రూ.1,098 ప్రీపెయిడ్ ప్లాన్లు, రూ.106, రూ.107, రూ.153, రూ.186, రూ.365, రూ.429, రూ.485, రూ.666, రూ.997, రూ.1,699, రూ.1,999 ఫస్ట్ రీచార్జ్ కూపన్లపై ఈ ఆఫర్ లభిస్తోంది. ఇక ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

మొదట చెన్నై, తమిళనాడు సర్కిల్లో దీన్ని సవరించనున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్ల ద్వారా అందించే మిగతా లాభాలకు ఎటువంటి మార్పులూ చేయలేదు. వాయిస్ కాలింగ్ నిమిషాలు, ఎస్ఎంఎస్ మెసేజ్ లు, డేటా లాభాల్లో ఎటువంటి మార్పులూ ఉండవు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం ప్రకటన గత ఏడాదే చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సవరణలు చేశారు.

Loading...