Friday, April 26, 2024
- Advertisement -

ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేదెవ‌రు..?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు చంద్రుల్ల చూపు దేశ రాజ‌కీయాల‌పై ప‌డింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఇద్ద‌రు చంద్రుళ్లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఒక రేమో భాజాపా, కాంగ్రెస్‌కు వ్య‌తిర‌కంగ ఫెడ‌ర‌ల్ ప్రెంట్‌కోసం ప్ర‌య‌త్నిస్తుంటే..ఒక రేమో యూపీఏ దాని మాత్ర‌ప‌క్షాల‌ను ఒక తాటి మీద‌ర‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. దేశ రాజ‌కీయాల్లో ఇద్ద‌రిలో ఎవ‌రు చ‌క్రం తిప్పుతారో ఒక సార చూద్దాం.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు అనేక విమ‌ర్శలు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్లాలో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జ‌న‌స‌మితి పార్టీలు క‌ల‌సి కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. గులాబీ బాస్‌ను ఓడించేందుకు కూట‌మి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. బంప‌ర్ మెజారిటీతో మ‌రో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది.

తెలంగాణా ముఖ్య‌మంత్రిగా రెండో సారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కేసీఆర్ మ‌రింత దూకుడు పెంచారు. ఇక సీఎంగా ఉంటూనే దేశ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించేందుకు ముందుకు క‌దులుతున్నారు. దానిలో భాగంగానే కొడుకు కేటీఆర్‌ను వార‌సుడిగా ప్ర‌క‌టించి పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా నిర్ణ‌యం తీసుకున్నారు.

పార్టీ బాధ్య‌త‌లు కొడుక్కు అప్ప‌గించ‌డంతో ఎక్క‌వ స‌మ‌యం జాతీయ రాజ‌కీయాలాపై దృష్టిపెట్టానున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ రెండూ దొందూ..దొందేన‌ని వారి వ‌ల్ల దేశానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రెండు పార్టీల‌కు వ్య‌తిరేకంగా చిన్ని చిన్న పార్టీల‌ను క‌లుపుకొని ఫెడ‌ర‌ల్ ప్రంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

గ‌తంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ప్రత్యేకంగా సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమైన సీఎం కేసీఆర్.. ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఝార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులతో చర్చించిన విషయం తెలిసిందే. ముంద‌స్తు ఎన్నికల్లో విజ‌యం సాధించి మంచి దూకుడు మీదున్నారు కేసీఆర్‌.

ఎమ్ఐఎమ్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీతో క‌ల‌సి దేశ వ్యాప్తంగా ఫెడ‌ర‌ల్ ప్రెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఉన్న మైనారిటీల‌ను అనుకూలంగా మ‌లుచుకొనే అవ‌కాశాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల సందర్భంగా కేంద్ర ప్రముఖులు మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ఇప్పుడు కాక‌పోయినా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ప్రెంట్ ఏర్పాటు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే తెలంగాణా ఎన్నిక‌ల్లో కూట‌మి ఘోరంగా ఓడిపోవ‌డంతో దాని ప్ర‌భాతం బాబుమీద ప‌డింది. దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న బాబుకు ఎన్నిక‌ల ఫ‌లితాలు న‌ష్టాన్ని క‌లిగించాయి.తెలంగాణ ఎన్నికల వ్యూహరచన అంతా చంద్రబాబుదే అన్నట్లు వ్యవహారం నడిచింది. ఆయన వ్యూహరచన ప్రకారమే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెసుకు కూడా ముందుకు వెళ్లిందనే అభిప్రాయం ఉంది.

రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేసినా, చంద్రబాబే ప్రధానంగా ప్రజలకు కనిపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు, చంద్రబాబుకు మధ్య పోరుగా తెలంగాణ ఎన్నికల సమరం సాగింది. జాతీయ స్థాయిలో బిజెపియేతర పక్షాలను ఏకం చేసే నేతల్లో చంద్రబాబు ముందు వరుసలో కనిపించారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ కూడా చంద్రబాబును బహుశా అలాగే చూసి ఉంటారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి స్థితిలో రాహుల్ గాంధీ చంద్రబాబుతో కలిసి నడిచే విషయంపై పునరాలోచన చేస్తారా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో బిజెపియేతర కూటమికి చంద్రబాబు నాయకత్వం వహించే పరిస్థితి ఉండకపోవచ్చునని అంటున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై నీలినీడలు అలుముకున్నాయని చెప్పవచ్చు.

చంద్రబాబును ముందుకు నెట్టే ప్రయత్నం కాంగ్రెసు చేస్తుందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే భావిస్తున్నారు. గ‌తంలో జ‌రిగిన భేటీకి ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్ గానీ అఖిలేష్ యాదవ్ గానీ హాజరు కాలేదు. బిఎస్పీ అధినేత మాయావతి కూడా దూరంగానే ఉన్నారు.

చంద్రబాబు నాయకత్వాన్ని ఉత్తరాది నేతలు ఈ స్థితిలో అంగీకరించడం కష్టమేనని భావించవచ్చు. దీనికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేపథ్యాన్ని అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఎవ‌రు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతారో త‌ర్వ‌లో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -