ఎన్ఐఎకి జగన్‌పై హత్యాయత్నం కేసు….. బాబు, లోకేష్‌ల ఆందోళనకు కారణమేంటి?

3460
Chandrababu and Lokesh Worry about YS Jagan attack case handed over to NIA
Chandrababu and Lokesh Worry about YS Jagan attack case handed over to NIA

జగన్‌పై హత్యాయత్నం నేరాన్ని చంద్రబాబు, లోకేష్‌లు ఒప్పేసుకున్నారా? కేంద్రం స్థాయిలో ఏం జరుగుతోంది? జగన్‌పై హత్యాయత్నం కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎన్ఐఏకి అప్పగిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఆ స్థాయిలో ఎందుకు ఆందోళన చెందుతున్నారు? జగన్‌పై ఉన్న కేసుల విషయంలో కోర్ట్ తీర్పులను కూడా గౌరవించరా అంటూ జగన్‌పై అసత్య ప్రేలాపనలు చేసే చినబాబు, పెదబాబులు ఇప్పుడు అవే కోర్టులే జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఎకి అప్పగించాయన్న విషయం మర్చిపోతున్నారా?

సానుభూతి కోసం జగనే తనపై దాడిచేయించుకున్నాడు అన్నది చంద్రబాబు, చినబాబుల నుంచి కిందిస్థాయి టిడిపి నాయకులు, పచ్చ మీడియా జనాలు చెప్పే మాట. అదే నిజమైతే ఎన్ఐఏ విచారణలో నిజాలు బయటపడితే జగనే కదా ప్రజల దృష్టిలో చులకన అవుతాడు. అలాంటి అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నాడు? జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్ట్ ఎన్ఐఏకి అప్పగిస్తే వైకాపా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ విచిత్రంగా చంద్రబాబు నుంచి లోకేష్‌తో సహా టిడిపి నాయకులు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది.

టిడిపి నాయకుడు హర్షవర్ధన్‌చౌదరి ప్రమేయం ఏంటి? లోకేష్‌తో హర్షవర్ధన్ బంధం ఏంటి అనే విషయాలన్నీ బయటపడి జగన్‌పై హత్యాయత్నం వెనకాల అసలు దోషులు చట్టానికి దొరకడం ఖాయమా అని చెప్పి ఢిల్లీలో ఉండే ఒక సీనియర్ ఎడిటర్ చేస్తున్న విశ్లేషణ టిడిపి నాయకుల గుండెల్లో భయం పుట్టిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రచారం కోసం జగనే చేయించుకున్నాడు అని డ్రామాలు ఆడినవాళ్ళను హైకోర్ట్ ద్వారా కార్నర్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేపు ఎన్ఐఏ కనుక నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు దోషులకు శిక్షపడేలా చేసిందంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.