Friday, April 19, 2024
- Advertisement -

బాబు గడ్డుకాలం.. గ్రహాలు అనుకూలంగా లేవట..

- Advertisement -

చంద్రబాబుకు ఈసారి అధికారం రాదా.? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా టీడీపీకి అడ్డంకులు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపోకండి.. అయితే టీడీపీకి అంతా అనుకూలంగా ఉన్నా.. గ్రహబలమే తేడా కొడుతోందట.. జ్యోతిష్యం టీడీపీకి బాగా లేదని సమాచారం.

తెలుగు దేశం పార్టీకి మార్చి చివరి వారం నుంచి గడ్డుకాలం ఎదురవ్వబోతోందని జ్యోతిష్యులు ఘంఠా పథంగా చెబుతున్నారు. చంద్రబాబుకు దైవభక్తి అన్నా.. ముహూర్తాలు అన్నా పెద్దగా పట్టవు. ఆయన మంది ప్రోద్బలంతోనే సమాజంలో ఉన్నామని దైవభక్తిని ప్రదర్శిస్తుంటారు. సెంటిమెంట్స్ ను పెద్దగా పట్టించుకోరు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ నమ్మకాలు ఎక్కువ. ఆయన ప్రతీది జ్యోతిష్యం.. ముహూర్తాలు చూసుకొని చేస్తుంటారు. ఇటీవల అలానే ఘనవిజయం సాధించారు. ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీని బేస్ చేసుకొని చంద్రబాబు కూడా ముందుకు వెళుతున్నారు.

కానీ ఈసారి చంద్రబాబును గ్రహాలు భయపెడుతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం టీడీపీకి మార్చి చివరి వారం నుంచి ఏమాత్రం బాగాలేదని..గడ్డుకాలమని జోతిష్య పండితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలో మొదలై ఆ తర్వాత ఏప్రిల్ వరకూ టీడీపీకి గడ్డుకాలం ఉందని అంటున్నారు.. మరి పోలింగ్ ఏప్రిల్ 11 వరకు టీడీపీకి శని దశ ఉండడంతో ఏం జరుగుతుందోనన్న టెన్సన్ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -