Thursday, April 25, 2024
- Advertisement -

యువతకు గాలమేస్తున్న చంద్రబాబు జ్ఞానభేరి

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా స్వామికార్యం స్వకార్యం ఉండేలా చూసుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు ఉండేలా ఆయన చతురత ప్రదర్శిస్తుంటారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జ్ఞానభేరి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీటిని వివిధ యూనివర్సిటీలు, స్టేడియంలు, విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ, ఇంజనీరింగ్, మెడిసిన్, డిప్లొమో ఇలా అన్ని రకాల విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. జ్ఞానభేరి కార్యక్రమం ప్రత్యేకంగా యువత కోసమే నిర్వహిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, సమస్యల పరిష్కారానికి, వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారిలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసి, వాళ్లు ఆవిష్కరించిన కొత్త ఆలోచనల ద్వారా సమాజ హితం కోసం విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి 39 మందిని ఎంపిక చేయనున్నారు. మొదటి బహుమతి లక్షరూపాయ‌లు, రెండో బహుమతి రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందజేయనున్నారు. దీంతో పాటు ప్రతిభ చూపినవారికి వెయిటేజీ ఇవ్వనున్నారు. జ్ఞానభేరి యాప్‌ విడుదల చేశారు. దాని ద్వారా విద్యార్థుల అభిప్రాయాలు, సలహాలు సూచనలను తెలుసుకుంటుూ ప్రభుత్వం తమ పథకాల రూపకల్పనకు ప్రాథాన్యమిస్తోంది.

అయితే ఈ జ్ఞానభేరీ కార్యక్రమం యువతలో ఆసక్తి పెంచేలా చంద్రబాబు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాల వేదికలపై ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర మంత్రులు ఓ వైపు రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలు, ప్రభుత్వ సంక్షేమపథకాలు గురుంచి వివరిస్తూనే, యువతను టీడీపీ వైపు, టీడీపీ ప్రభుత్వ పథకాల వైపు ఆలోచించేలా ఆకట్టుకుంటున్నారు. ఇస్రో, పోలవరం, ప్రత్యేకహోదా, సోలార్ పవర్, అంటువ్యాధులు ఇలా అనేక రకాల సమస్యలు, వాటి పరిష్కారానికి కొత్తతరం చూపించే మార్గాలను స్వీకరిస్తూ, ఇప్పటికే ఆయా అంశాలపై ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ఆచరిస్తున్న విధానాలను యువతకు చెప్పుకొస్తున్నారు. మరో పదేళ్లు టీడీపీ అధికారంలో ఉంటే రాష్ట్రం దశ దిశ మారుస్తానని చంద్రబాబు చాలా నేర్పుగా వివరిస్తున్నారు. రాజకీయ ప్రసంగం కాకుండానే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్న కోణంలో ఆయన చతురత ప్రదర్శిస్తున్నారు. యువత ఏ రంగంలో నిలదొక్కుకోవాలన్నా, పూర్తి సపోర్ట్ తమ ప్రభుత్వం చేస్తుందని, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగమించేలా అన్నివిధాలా చేయూతనిస్తుందని చెబుతూనే రాష్ట్ర ప్రయోజనాలు, వాటిని నెరవేర్చాలంటే టీడీపీ ప్రభుత్వం మరో పదేళ్లు ఉండాలనే అసలు లక్ష్యాన్ని పరోక్షంగా యువత బుర్రలకు చేర్చడంలో చంద్రబాబు సక్సెక్ అవుతున్నారు. గతంలో వైఎస్ జగన్ యువభేరి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అవి కేవలం చంద్రబాబుని తిట్టడానికే, ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తి చూపడానికే అన్నట్టు సాగాయి. కేవలం వైఎస్ఆర్ సీపీ రాజకీయ సభ లాగా, ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలా యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ జ్ఞానభేరీ ద్వారా చంద్రబాబు అటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పిస్తూ, వారి ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీస్తూ, సామాజిక ఆర్ధిక సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపేవారిని ప్రోత్సహిస్తూ, యువతను టీడీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. అందుకే జగన్ యువభేరీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిందిగా మిగిలిపోతే, చంద్రబాబు జ్ఞానభేరీ రాష్ట్ర ప్రయోజనాలు, యువత లక్ష్యాలతో పాటు ఆయన పార్టీ ప్రయోజానాల కోసం వేదికగా ఉపయోగపడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -