టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌దా….? అందుకే మ‌రో కొత్త రాజ‌కీయానికి తెర‌ లేపిన బాబు…?

3943
Chandrababu New Political Strategy in Andhra Pradesh for 2019 Elections
Chandrababu New Political Strategy in Andhra Pradesh for 2019 Elections

ఏపిలోనూ మ‌హాకూట‌మి పురుడుపోసుకోనుందా….? కూట‌మికి తెలుగుదేశం పార్టీ సారథ్యం వ‌హించ‌నుందా అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు. ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతోపాటు అవినీతి…అశ్రిత‌ ప‌క్ష‌పాతం తెలుగుదేశం పార్టీని 2019లో అధికారానికి దూరంగా నెట్ట‌నున్నాయి. దీంతో మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యుడు…జ‌న‌నేత జ‌గ‌న్ సొంతంగా అధికారం చేప‌ట్టే అవ‌కాశం తెలుగునాట స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికి విరుగుడుగా బిజేపి బూచిని చూపి 40ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అయిన చంద్ర‌బాబు నాయుడు కూట‌మితో జ‌గ‌న్ ను నిలువ‌రించే వ్యూహ‌ర‌చ‌నకు పూనుకున్న‌ట్లు స‌మాచారం.

2019 సాధార ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాలఎన్నిక‌ల్లో తెలుగురాష్ట్ర‌మైన‌ తెలంగాణ లో ప్ర‌చారం ఊపందుకోవ‌డ‌మే కాదు పోలింగ్ ముహ‌ర్తం ముంచుకొస్తోంది. అయితే ఏపిలో మాత్రం షెడ్యూల్ ప్ర‌కారం 2019 ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేష‌న్ వెలువ‌డి మే 13నాటికి కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరాల్సిన ప‌రిస్థితి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో త‌న వెంట నిలిచిన బిజేపి…జ‌న‌సేన‌లకు దూర‌మైంది. బిజేపి చెలిమికి చెల్లుచీటి ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఐటి, ఈడి, సిబిఐ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకుంటూ వ‌చ్చి న టిడిపి అంచ‌నాలు వాస్త‌వ రూపం దాలుస్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రిపై ఈడి కొర‌డా జులిపించ‌గా…రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ లో భూమి చ‌వ‌క‌గా కొట్టేసి ఆ భూములు చూపి కోట్ల రూపాయ‌లను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న తీరుపై ఐటి ఇప్ప‌టికే దాడులు చేసి స‌మాచారాన్ని గుప్పిట పెట్టుకుంది.దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బిజేపిపై ఎదురుదాడికి దిగుతూ సిబిఐ రాష్ట్రంలో దాడులు జ‌రిపేందుకు ఇవ్వాల్సిన జ‌న‌ర‌ల్ క‌న్సెంట్ ను ఉప‌సంహ‌రించుకున్నారు. అయితే దీని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని రాజ్యంగా…న్యాయ నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీంతో డిసెంబ‌ర్ 11వ తేది వెల్ల‌డికానున్న ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత ఏపిపై ముఖ్యంగా టిడిపి ముఖ్య‌నేత‌లు సాగించిన అవినీతి బాగోతాల‌పై కేంద్రం సంస్థ‌లు పూర్తిస్థాయిలో దృష్టి సారించ‌నున్న‌ట్లు ఢిల్లీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

వాడుకుని వ‌దిలేస్తార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తొలినుంచి ఉన్న అప‌వాదు. అయితే దేశమంతా బిజేపి జెండా ఎగురవేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతూ….త‌న‌కుమాలిన ధ‌ర్మం మొద‌ట చెడ్డ భేరం అన్న రీతిలో బిజేపి విస్త‌ర‌ణ త‌ప్ప మ‌రొక‌రి ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద పీఠ వేయ‌ని అమిత్ షా, న‌రేంద్ర మోడీ జోడి వ‌ద్ద బాబు నాట‌కాలు విఫ‌ల‌మైయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో టిడిపి ఎవ‌రికి వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిందో వారి చెంత‌కు చేరి తెలుగువారి ఆత్మాభిమానాన్ని చంద్ర‌బాబు నాయుడు తాక‌ట్టుపెట్టార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా….గోబెల్స్ నీతిని న‌మ్మె చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస..టిడిపి బంధాన్ని రాష్ట్ర‌…దేశ ప్ర‌యోజ‌నాల‌కే అని చెబుతూ తిరుగుతున్నారు. అయితే బిజేపి టార్గెట్ నుంచి త‌న‌ను కాపాడే అవ‌కాశం అంతో ఇంతో కేంద్రంలోని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంకు ఉంద‌ని చంద్ర‌బాబు శ‌ర‌ణు చొచ్చిన‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. అయినా అది ఫ‌లితాన్ని ఇస్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. తాజాగా మాజీ కేంద్ర‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బినామిగా ముద్ర‌ప‌డ్డ సుజ‌నా చౌదిరిపై ఈడి విచార‌ణ‌కు దిగ‌టంతో ఆయ‌న అరెస్ట్ త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. లిక్క‌ర్ కింగ్ విజ‌య‌మాల్య త‌ర‌హాలో సుమారు ఆరువేల కోట్లు బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన‌ట్లు ఈడి పేర్కొంది. దీనిపై టిడిపి శ్రేణులు ఒక్క‌మాట‌కూడా మాట్లాడ‌కుండా సైలెంట్ గా ఉండిపోవ‌డం గ‌మ‌నార్హం.

కాగా రాజ‌కీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ఏపిలో ఏకాకిగా మిగిలింది. గ‌త ఎన్నిక‌ల్లో అల‌వికాని హామిలు ఇ్వ‌డంతోపాటు బిజేపి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు క‌లిసి తిరిగితే స్వ‌ల్ప ఓటింగ్ శాతంతో చంద్ర‌బాబు నాయుడు సీఎం పీఠాన్ని ద‌క్కించుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ టిడిపితో బంధాన్ని తెంచుకుని చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ల‌పై ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అలాగే సిపిఐ, సిపిఎం లు కూడా బిజేపితో అంట‌కాగిన టిడిపి వైపు కాక జ‌న‌సేన తో క‌లిసి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై వేదిక పంచుకున్నాయి. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార టిడిపి క‌న్నా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌ల దాడి మొద‌టి నుంచి చేస్తున్నారు. అయితే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పై త‌క్కువుగా టిడిపిపై ఎక్కువ గురిపెట్టి ఆరోప‌ణ‌లు సంధించిన ప‌వ‌న్ మ‌ళ్ళీ రూట్ మార్చి జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాన్ పూర్తిగా చంద్ర‌బాబు కోట‌రి మ‌నిషేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ విమ‌ర్శ‌లు ఎక్కిపెట్టింది. తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి పేరిట చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ తో పాటు సిపిఐ, టిజేఎస్ తో జ‌ట్టుక‌ట్టారు. ఏపి ఎన్నికల్లో నూ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే స్కెచ్ లో భాగంగానే తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి పేరిట చంద్ర‌బాబు క‌థ‌న‌డుపుతున్నారు. అయితే ఏపిలో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేసినా టిడిపి 40సీట్ల‌క‌న్నా మించి గెలిచే అవ‌కాశం లేద‌ని అంత‌ర్గ‌త స‌ర్వేల్లో తెలడంతో బాబు బిజేపి బూచి చూపి ప‌వ‌న్ క‌ళ్యాణ్, వామ‌ప‌క్షాల‌ను రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌దిగా లౌకిక వాదం ముసుగులో కూటమికి తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది.

బిజేపి వ్య‌తిరేక పార్టీల‌ను ఒక తాటిమీద‌కు తేవ‌డంలో త‌న‌ను మించిన మొగోడు లేడ‌న్న రీతిలో చంద్ర‌బాబు బిల్డ‌ప్ ఇస్తున్నా జాతీయ స్థాయిలో సిపిఐ, సిపిఎంల‌ను ఏపిలో క‌లిసి పోటీ చేసేలా ఆ పార్టీల జాతీయ నేత‌ల‌ను ప్ర‌శ‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డ‌ట్టు తెలిసింది. సిపిఐ చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు…. ఇచ్చిన హామీల‌కు కొంత సానుకూలంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నా….సిపిఎం మాత్రం చంద్ర‌బాబు ఎత్తును పసిగ‌ట్టి దూరం పెట్టిన‌ట్లు తెలిసింది. అయితే ఎన్నిక‌ల షెడ్యూల్ నాటికి సిపిఎంను కూడా త‌న 40ఏళ్ళ అనుభ‌వంతో బుట్ట‌లో ప‌డ‌వేస్తార‌న్న ధీమా టిడిపి వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది. అయితే తిక్క‌కు మారుపేరుగా నిలిచే ప‌వ‌న్ ను త‌న వైపు తిప్పుకునేందుకు క‌ర్నాట‌క సీఎం కుమార‌స్వామిని…డిఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ ల‌ను సాయం కోరిన‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరుకు ఇప్ప‌టికే రెండుసార్లు వెళ్ళి వ‌చ్చిన చంద్ర‌బాబు….చెన్నైని చుట్టి వ‌చ్చారు. దీని త‌రువాతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా అధికారప‌క్షాన్ని వ‌దిలేసి జ‌గ‌న్ పై మాట‌ల తూటాలు పేలుస్తూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నావేస్తున్నాయి.

దీంతో ఏపిలోనూ వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్, జ‌న‌సేన‌ల‌తో క‌లిసి తెలుగుదేశం పార్టీ కూట‌మిగా ఏర్ప‌డి జ‌న‌నేత జ‌గ‌న్ ను అధికారంలోకి రాకుండా నిలువ‌రించే ప్ర‌య‌త్నాల‌ను చంద్ర‌బాబు స్పీడ్ అప్ చేస్తున్నారు. కూట‌మిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టిడిపి ఉండేలా చూసుకుంటూనే జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ అడిగిన సీట్లు ఇవ్వ‌డ‌మే కాదు గెలుపుకు అవ‌స‌ర‌మైన అంగ‌,అర్థ‌సాయాన్నిచంద్ర‌బాబు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం. దీంతో ఏపిలోనూ కూట‌మి ఖాయ‌మ‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది.