లోకేష్‌కి దిమ్మతిరిగే స్థాయిలో దెబ్బకొట్టే పాఠాలను బాబే ఎన్టీఆర్‌కి నేర్పిస్తున్నాడా?

1242
Chandrababu Politics: Jr NTR Vs Nara Lokesh
Chandrababu Politics: Jr NTR Vs Nara Lokesh

ఎన్టీఆర్ వాగ్ధాటి, ఎన్టీఆర్ ఛరిష్మాని తట్టుకోవడం ఒట్టి ముద్దపప్పు నాయకుడు అని స్వయంగా తెలుగుదేశం నాయకులే కామెడీగా మాట్లాడుకునే లోకేష్ తరం కాదు. ఆ విషయంలో చంద్రబాబుకు కూడా స్పష్టత ఉంది. అయితే లోకేష్‌కి ఎన్టీఆర్ అడ్డుకాకూడదు అని చంద్రబాబు పన్నుతున్న రాజకీయ కుట్రలు, వ్యూహాలు అన్నీ కూడా చంద్రబాబుకే బూమరాంగ్ అవుతాయా? ఎన్టీఆర్‌ ఎదగడానికి, రాజకీయ వ్యూహాలను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఙానాన్ని ఎన్టీఆర్‌కి ఇస్తున్నాయా? చంద్రబాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెల్ఫ్‌గోల్ ఇదే అవబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

కనీసం ఒక్క ఎన్నికల్లో అయినా ప్రజల మెప్పుపొందకుండా, పార్టీలో కూడా ఏ కష్టమూ లేకుండా అందలం ఎక్కిన నాయకుడు లోకేష్. ఇప్పటికీ కూడా నాయకుడిగా నిరూపించుకుంది, మంత్రిగా చేసింది ఏమీ లేదు. పైగా మాట తడబడుతూ పార్టీనే అడ్డంగా బుక్ చేయడం, తన అజ్ఙానంతో నవ్వుల పాలు కావడం లోకేష్‌కి అలవాటుగా మారింది. అన్నింటికీ మించి అవినీతి విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడని, లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకూ అన్ని లెక్కలు లోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి.

లోకేష్ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు చంద్రబాబు పన్నుతున్న కుట్రల పుణ్యమాని ఎన్టీఆర్ రాజకీయ పాఠాలు చాలానే నేర్చుకుంటున్నాడు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్, నందమూరి వారసులందరినీ బాబు వాడుకుని వదిలేస్తున్నవైనం, 2009 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకోసం ప్రాణాలొడ్డితే ఆ తర్వాత లోకేష్‌కి పోటీ అవుతాడని చెప్పి ఎన్టీఆర్‌ని రాజకీయంగా, సినిమాల పరంగా కూడా అణగదొక్కాలని చూడడంలాంటి విషయాలపై ఎన్టీఆర్‌కి పూర్తి అవగాహన ఉంది. ఇక ఇప్పడు సుహాసిని విషయంలో కూడా ఎన్టీఆర్‌ని కార్నర్ చేయడానికి చంద్రబాబు అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాడు. బాబు ఎన్ని కుట్రలు రచిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం అన్నింటినీ సమర్థంగా ఎదుర్కుంటూ నిలబడుతున్నాడు. చంద్రబాబుకు ఎక్కడా దొరక్కుండా సుహాసినిని గెలిపించమని రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ అయితే రాజకీయ అనుభవజ్ఙులను కూడా ఆశ్ఛర్యపరిచింది.

ఇప్పుడు బాబు వ్యూహాలను, కుట్రలను ఎదుర్కుంటున్న వైనమే ఎన్టీఆర్‌కి అన్ని పాఠాలూ నేర్పుతుందని, రాజకీయ చాణక్యుడిగా ఎదిగేలా చేస్తుందని………అదే జరిగితే మాత్రం భవిష్యత్తులో ఎన్టీఆర్ ముందు లోకేష్ కనీసం నిలబడలేడని స్వయంగా టిడిపి నాయకులు, టిడిపి మద్దతుదారులైన మీడియా జనాలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.