Saturday, April 20, 2024
- Advertisement -

పరిశ్రమలపై చంద్రబాబు ప్రచార బిల్డప్….. గాలి తీసేసిన ప్రముఖ సంస్థ

- Advertisement -

దేవుడా…… ప్రచార గిమ్మిక్కులతో చేసిన మాయ అంతా బయటపడిపోయింది. పరిశ్రమలు తీసుకురావడానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అని ఊదరగొట్టిన అబద్ధాలన్నీ ప్రజలకీ తెలిసిపోయేలా నిజాలు బయటికొచ్చాయి. ప్రపంచ స్థాయి……పరిశ్రలు అని చెప్పుకునే బాబుగారి బిల్డప్, పచ్చ బ్యాచ్ ప్రచారం అంతా ఇప్పుడు గాలి తీసేసినట్టుగా అయిపోయింది. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది, ప్రారంభించింది కాంగ్రెస్ హయాంలో అయినప్పటికీ బాబు పేరు కొట్టేశారు. ఇక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వైఎస్ హయాంలో బాబు హయాంకంటే చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో సహా అన్నీ కూడా వైఎస్ హయాంలో వచ్చినవే. అయినప్పటికీ ప్రచారంతో బాబు క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు పరిశ్రమల విషయంలో చంద్రబాబు చేతకాని తనం, అవినీతి వ్యవహారాలు ఎలా ఉంటాయో నగ్నంగా బయటపడిపోయాయి. ఆ వివరాలన్నీ సాక్ష్యాధారాలతో సహా మీరే చదివి తెలుసుకోండి.

బాబు అవినీతి ఏ స్థాయిలో ఉందంటే …!!!
1.AP లో చెత్త పాలన , AP కంటే బీహార్ చాల నయం
AP చెప్పే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంతా బోగస్
CRDA ని స్వతంత్రంగా పని చేయనివ్వరు , రాజకీయ జోక్యం , లోపాయికారీ ఒప్పందాలు అవినీతి ఎక్కువ
-2017 ఏప్రిల్ 28 న జపాన్ మాకీ చైర్మన్ పూహిమికో
(మాకీ సంస్థను రాజధాని డిజైన్ ల కోసం బాబు పిలిపించారు)

అంటే ఒక విదేశీ జపాన్ సంస్థ బాబు పాలన లో అవినీతి ఏరులై పారుతోంది అని చెప్పింది

2.2014 ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాను అని స్పీకర్ కోడెల చెప్పారు
అంటే TDP పార్టీ ఏ విధంగా డబ్బు వెదజల్లి గెలుస్తుందో కదా

3.5 కోట్లు నాకు ఇచ్చి కానీ నీవు రైల్వే కాంట్రాక్టు చేయడానికి వీల్లేదు అంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ MLA కోరుకొండ్ల రామకృష్ణ బెదిరించిన ఆడియో టేపులను ఆ కాంట్రాక్టర్ వినిపించాడు కదా !!!

4.అభి రుద్ద వంకాయా మేమంతా డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాము అని టీడీపీ లో చేరిన కోడుమూరు వైసీపీ MLA లని గాంధీ టీవీ ల ముందు చెప్పాడు కదా !!!

5.నెల్లూరు SI ఒకరు నేను నెలా నెలా 2 కోట్లు కోపం కట్టాలని పై అధికారులు రాజకీయ నాయకులూ వత్తిడి చేస్తున్నారు, నా వాళ్ళ కాదంటూ కలెక్టర్ కు లేఖ రాసాడు

6.బాబు ప్రభుత్వం లో ఈ ఐదేళ్లలో 3 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగింది, ఒక ఇర్రిగేషన్ శాఖ లోనే 20 వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది అని బాబు దగ్గర చీఫ్ సెక్రటరీ గా పని చేసిన అజయ్ కళ్ళం చెప్పారు

7.ఇంకో మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణ రావు సైతం అవినీతి వరదలై పారుతోంది అని చెప్పారు

8.నేను ఓటుకు 5 వేలు ఇవ్వగలను కానీ ఇవ్వను అని నంద్యాల ఉప ఎన్నికలప్పుడు బాబు చెప్పాడు
రాష్ట్ర జనాభా 5 కోట్లు అనుకొంటే ఒక్కొక్కరికి 5 వేల చొప్పున 25 వేల కోట్లు ఇవ్వగల కెపాసిటీ మన వాచి ఉంగరం లేని నిప్పు నాయుడు కు వచ్చిందంటే ఎన్ని లక్షల కోట్లు సంపాదించివుంటాడో కదా !!!

తెలంగా ఎన్నికల్లో MLC ఓటు వేస్తె 5 కోట్లు ఇస్తానన్న బ్రీఫుడు నిప్పు కదా

9.హైదరాబాద్ లో చదరపు అడుక్కి 2 వేలు తీసుకొని మంచి మంచి బిల్డింగ్ లు కట్టిస్తారు అటువంటింది అమరావతి లో చదరపు అడుక్కి దాదాపు 11 వేలు ఇచ్చి చిన్న వర్షం వస్తేనే నీరు కారే రెండు బిల్నిగ్ లు కట్టి ఇచ్చారు
ఇందులో ఒక వెయ్యి కోట్లు నొక్కేశారు

10.మార్కెట్ లో 2 వేలకు దొరికే టీవీ సెటాప్ బాక్స్ ను 4 వేలకు అమ్ముతున్నారు
ఆరు వందలకు వచ్చే లేదు వీధి లైట్ ను 6 వేలు పెట్టి కొంటున్నారు
ఎలుకను పట్టుకున్నందుకు 20 వేలు అట

11.ప్రధాని ఇళ్ల పధకం క్రింద కట్టే పేదల ఇళ్లకు తెలంగాణ లో ఒక్కో చదరపు అడుక్కి సగటున వెయ్యి ఖర్చు అవుతుంటే AP లో మాత్రం దాదాపు 3 వేలు వసూలు చేస్తున్నారు, ఇందులోనే 5 వేల కోట్లు దోచుకొంటున్నారు బాబు మనుషులు

12.బాబు అవినీతి గురించి ఇతరులు ఏమన్నారు?

2009 లో టీడీపీ నుంచి విడిపోయి నవ తెలంగాణ అని సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు దేవేందర్ గౌడ్ 2 వేల కోట్లు దాక సంపాదించుకున్నాడు అందుకే కొత్త పార్టీ పెట్టుకొంటున్నాడు అని ఈనాడు పత్రిక రాసింది
మరి ఒక్క టీడీపీ BC మంత్రి 2 వేల కోట్లు సంపాదించి ఉంటె బాబు ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉంటాడో కదా

1995 లో ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి సీఎం అయిన బాబు పై 3 సం ల లోపే 1998 లో బాబు అవినీతి పై అప్పటి బీజేపీ 101 ఆరోపణలతో స్వేత పత్రం వేసింది, అందులో బాబుకు సింగపూర్ లో ఆస్తులున్నాయి అని కూడా చెప్పింది, మేము వస్తే బాబును జైలుకు పంపిస్తాము అని బాబు కటకటాల వెనక ఉన్న బొమ్మ కూడా వేసింది.

2001 లో ‘బాబు జమానా అవినీతి ఖజానా’ అని CPM పార్టీ వాళ్ళు ఒక్క పుస్తకం రాసారు అందులో పేదలకు ఇచ్చే బియ్యం కూడా నొక్కేసాడు బాబు అని రాసారు

గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు
-చాల ఏళ్ల క్రితం నందమూరి హరికృష్ణ, బాబు బామ్మర్ది

NTR CM గా ఉన్నప్పుడు మహానాడు హుండీలో వేసే డబ్బులు కూడా బాబు నొక్కేసేవాడు అని ‘ఒక చరిత్ర ‘పుస్తకం లో బాబు తోడల్లుడు దగ్గుపాటి రాసాడు

ప్రధానంగా లక్ష కోట్ల విశాఖ భూకుంభకోణం, లక్ష కోట్ల భ్రమరావతి భూకుంభకోణం, స్విస్ ఛాలంజ్, పోలవరం అవినీతి ,అగ్రిగోల్డ్ , అప్పులు ,విద్యుత్ కొనుగోళ్లు, తన మనుషులకు బందువులకు వేలాది ఎకరాల భూకేటాయింపులు గురించి చూద్దాము

13.పోలవరం, ఉత్తరాంద్ర సుజల స్రవంతి మినహా మిగిలిన పెండింగ్ ప్రాజెక్ట్ లు 17 , 368 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అవుతాయని చెప్పిన 2014 లో సీఎం అయిన తోలి నాళ్లలో స్వేత పత్రం లో చెప్పిన బాబు 37 వేల కోట్లు ఎక్కువ ఖర్చు చేసినా ఎందుకు పూర్తి కాలేదు పెండింగ్ ప్రాజెక్ట్ లు? అంటే 20 వేల కోట్లు శుభ్రంగా భోంచేసారు అనేగా అర్ధం

కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ను బాబు ఎందుకు తీసుకున్నాడు ?
తీసుకొని పోలవరం అంచనాలను 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు ఎందుకు పెంచాడు?
అంటే దాదాపు 42 వేల కోట్లు పెంచాడు, ఈ పెంచిన డబ్బు ఎవరి జేబు లోకి?

2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల నష్టపరిహారం పెరిగింది నిజమే అయినా ఆనాడు ఉన్న 3 వేల కోట్ల నుంచి మూడు రేట్లు పెరిగి అది నేడు దాదాపు 10 వేల కోట్లు అయింది కానీ మరి మిగిలిన 30 వేల కోట్లు ఎందుకు పెంచారు?
పోలవరం డిజైన్ మారకపోయినా పోలవరం లో నష్టపోయే నిర్వాసితుల సంఖ్యను ఎందుకు రెట్టింపు చేసి చూపారు?
ఈ నష్ట పరిహారం డబ్బు ఎవరి జేబులోకి?

ప్రాజెక్ట్ ఎత్తు పెరగకుండా ముంపునకు గురయ్యే ప్రాంతం రెండు రేట్లు పెరిగింది అని అంచనాలు ఎలా పెంచుతారు?
పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులకు లెక్కలు ఎందుకు చెప్పరు?

పోలవరం లో అంతులేని అవినీతి జరుగుతోంది అని కేంద్ర ప్రభుత్వ అడిట్ సంస్థ కాగ్ తేల్చి చెప్పింది

14.విశాఖ భూకుంభకోణము విలువ లక్ష కోట్ల పై మాటే

విశాఖ లో లక్ష ఎకరాలకు సంబందించిన రికార్డు లు తారుమారయ్యాయి, హుదుద్ తుఫాన్ లో కొట్టుకుపోయాయి అని మే 30 , 2017 న విశాఖ కలెక్టర్ ప్రకటించారు
హుదుద్ తుఫాన్ ఏమి సునామీ కాదు కదా ,బీరువాలలో ఉన్న రికార్డు లు ఎలా తారుమారు అవుతాయి?
పైగా విశాఖ జిల్లాకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన పాత్రుడు ఈ విశాఖ భూ కుంభకోణం లో మా TDP కి చెందిన నేతలు ఉన్నారు అని చెప్పారు
విశాఖ లో ఎకరం కనీసం కోటి నుంచి 25 కోట్ల దాక ఉంది అంటే సగటున ఎకరం కోటి వేసుకున్న లక్ష కోట్లకు పై మాటే అంటే ఇదంతా ఎవరి జేబులోకి బాబూ?

15.రాజధాని భూకుంభకోణం
అమరావతి రాజధాని కుంభకోణం దేశం లోనే అతి పెద్ద భూ కుంభకోణము- రిటైర్డ్ IAS EAS శర్మ

రాజధాని ముసుగులో సర్కారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించడం తప్పుడు విధానం
సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనను సర్వీసులో ఉండగానే తప్పుపట్టాను
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం

అమరావతి ఎంపికలో ఒక జాతి ప్రయోజనాలు అవినీతి , రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి,
-ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి IYR కృష్ణ రావు

రాజధాని నూజివీడు లో అని నాగార్జున యూనివర్సిటీ లో అని ,పశ్చిమ గోదావరి జిల ఏలూరు లో అని రకరకాలుగా అను కుల మీడియా ఈనాడు జ్యోతి లో రాయించి చీప్ గా డెడ్ చీప్ గా బాబు అండ్ కో బినామీల పేరుతొ అమరావతి ప్రాంతం లో 25 వేల ఎకరాలు కొన్నారు

2014 జూన్ 8 సీఎం గా ప్రమాణ శ్వీకారం చేసిన బాబు నెల రోజులకే అంటే 2014 జులై 7 గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామం లో 7 ఎకరాలు, సెప్టెంబర్ లో ఇంకో 7 ఎకరాలు మొత్తం 14 ఎకరాలు, సగటున ఎకరం 8 లక్షల 70 వేలకు కొన్నది హెరిటేజ్ సంస్థ

కంపెనీ కొనుగోలు చేయగానే ఆ భూమి ఎదుట రాజధాని ప్రకటన వచ్చింది.చుట్టు పక్కల గ్రామాల భూములు రాజధాని పూలింగ్‌లోకి వెళ్లినా… చెక్కు చెదరకుండా కంపెనీకే మిగిలింది.

సుజనా చౌదరి అయితే బహిరంగంగా అవును మేము రాజధాని ప్రాంతం లో వందల ఎకరాలు కొన్నాము , అయితే ఏంటి? అని అన్నాడు

రాజధాని ప్రాంతం లో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బాబు ఎకరం 4 కోట్లకు ఇస్తున్నాడు కాబట్టి
ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం 4 కోట్ల పై మాటే అంటే 25 వేల ఎకరాలు బాబు అండ్ కో కొని లక్ష కోట్లు వెనకేసుకున్నారు

రైతుల నుంచి తీసుకున్న భూములు అగ్రి జోన్ లోకి వస్తాయని చెప్పి తక్కువ రేట్లు పెట్టి బాబు అండ్ కో కొన్న భూములను రియల్ ఎస్టేట్ పరిధి లోకి తెచ్చి రేట్లు పెంచి ఈ విధంగా కూడా దోచుకొంటున్నాడు బాబు

(ఈ సందర్భణగా 1995 లో సీఎం అయిన బాబు 98 ప్రాంతాల్లో హైటెక్ సిటీ కట్టేటటప్పుడు ముందే తన సొంత మనుషులు అయిన సినీ హీరో మురళి మోహన్ కుచెప్పి అక్కడ వందల ఎకరాలు చీప్ గా కొనిపించి తరువాత కోట్లకు అమ్ముకొని లాభపడ్డాడు అని ఆనాడు పత్రికలు రాశాయి

అలాగే దక్షిణ భారత దేశం లో కులాల పాత్ర మీద రీసెర్చ్ చేసిన లండన్ రీసెర్చ్ స్కాలర్ Dalel Benbabaali కూడా బాబు ఏది చేసినా అవినీతి కుల ప్రీతి ఉంటుంది అని హైటెక్ సిటీ కట్టింది కూడా తన కులస్థులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి జూబిలీ హిల్స్ కు దగరలో ఉండే మాదాపూర్ ప్రాంతం లోనే, తద్వారా అయన కులస్థులు బాగా లబ్ది పొందారు అని చెప్పిన వీడియో లు ఉన్నాయి )

16.స్విస్ ఛాలెంజ్ పేరిట మరో కుంభకోణం

అసలు బ్లాక్ మనీ దాచుకొనే దేశాల్లో ఇప్పుడు సింగపూర్ మొదటి స్థానం లో ఉంది అని ది గార్డియన్ అనే ఆంగ్ల పత్రిక పరిశోధనాత్మక వ్యాసం రాసింది అందులో ఒక AP నాయకుడికి కు సింగపూర్ లో హోటల్ ఉంది అని కూడా రాసింది

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందొ స్విస్ ఛాలెంజ్ లో ఛాలెంజ్ కూడా అంతే ఉంది
2009,మే 11 న హై కోర్ట్ స్విస్ ఛాలెంజ్ విధానం వద్దు అని చెప్పింది

మాజీ ఫైనాన్స్ సెక్రటరీ Dr విజయ్ కేల్కర్ కమిటీ ఆద్వర్యం లో కేంద్రం ఏర్పాటు చేసిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ లోప భూయిష్టం అవినీతి కి అవకాశాలు మెండు అని నవంబర్ 2015 లో చెప్పింది

అయినా సింగపూర్ కంపెనీ లలో బినామీ వాటాలున్న బాబు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎనుకున్నాడు,

సింగపూర్‌తో ఒప్పందాలు ‘పొట్టు మాకు. పప్పు మీకు’ అన్నట్లు గా ఉంది
అసెండాజ్‌ సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీలతో కూడిన కన్సార్టియంకు ఒప్పందం అప్పగిస్తూ సంతకాలు జరిగాయి

చంద్రబాబు మిత్రుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌ ఈశ్వరన్‌ తాను డైరక్టర్‌గా ఉన్న, తనకు ఆర్థిక ప్రయోజనాలున్న సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ అనే ప్రయివేట్‌ సంస్థతో పాటు అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జ్‌ అనే ప్రయివేట్‌ కంపెనీ పేరును తెరపైకి తెచ్చారు. ఈశ్వరన్‌ 2013 జనవరి 13 నుంచి సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌కు డైరక్టర్‌గా ఉంటున్నారు. వివిధ కాంట్రాక్టులు ఈ కంపెనీకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించడం డైరక్టర్‌గా ఆయన ప్రధాన కర్తవ్యం. ఆయన సలహా మేరకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంస్థలతో స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిన బిడ్‌లు దాఖలు చేయించింది.

సెంబ్‌కార్ప్‌పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ బ్రెజిల్‌లో 12 డ్రిల్లింగ్‌ రిగ్గుల నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందడానికి పెట్రో బ్రాస్‌ అధికారులకు 95కోట్ల అమెరికన్‌ డాలర్ల లంచం ఇచ్చి బ్రెజిల్‌ న్యాయస్థానంలో దోషిగా నిలబడింది. ఈ కుంభకోణం తర్వాత ఈ కంపెనీ షేర్ల విలువ బాగా పడిపోయింది. ఎస్‌ ఈశ్వరన్‌ సింగపూర్‌ మంత్రిగా ఉంటూ తాను డైరక్టర్‌గా ఉన్న ఒక కళంకిత కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు.
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్‌ పేరుతో కళంకితమైన ఆ దేశ ప్రయివేట్‌ కంపెనీని అమరావతి నగర నిర్మాణానికి ఆహ్వానిస్తోంది.

మన దేశ ఇంజనీర్ లు అయితే మురికి వాడలు కడతారు అని హేళన చేసి రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పేరిట తన బినామీలకు వాటాలు ఉన్న కొన్ని సింగపూర్ సంస్థలకు అప్పచెప్పాడు

ఎకరం 4 కోట్లు చేసే 1691 ఎకరాలను (6 ,764 కోట్లు)సింగపూర్ కంపెనీలకు అప్పచెబుతాడు
మరల 5500 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే నీరు రోడ్లు మిగిలిన సదుపాయాలు ఇవ్వాలి అట
అంటే మనం 12 వేల కోట్లకు పైన ఖర్చు పెడితే మనకు 42 శాతం వాటా ఇస్తారట , సింగపూర్ కంపినీలు మాత్రం 306 కోట్లు పెట్టుబడిగా పెట్టి 58 శాతము వాటా తీసుకుంటారట
మరి ఇదో రకం దోపిడీ

పైగా ఇందులో ఏదన్నా తప్పని తేలితే కేవలం లండన్ కోర్ట్ లోనే ఛాలెంజ్ చేయాలట, ఇండియా లో కాదు
మరి రైతు లేదా బాధితుడు లేదా ప్రభుత్వం లండన్ కు వెళ్లి కేసు వేయాలా?

స్విస్‌ ఛాలెంజ్‌పై హైకోర్టు మొట్టికాయ, ప్రశ్నల వర్షం
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌రంగనాథన్‌, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను న్యాయపరమైన అనేక ప్రశ్నలు వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ప్రభుత్వానికే తెలియకపోతే ఎలా? ఇంతవరకు సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ఎన్ని బిడ్స్‌ వచ్చాయి? సింగపూర్‌ కన్సార్టియం సీల్డు కవర్‌లో ఆదాయ వివరాలు ఉంచితే, రహస్యంగా ఉండాలని ఆ సంస్థ కోరినా, కనీసం ప్రభుత్వానికైనా ఆదాయ వివరాలు తెలియాలి కదా? ప్రభుత్వానికే ఆదాయ వివరాలు తెలియవంటే ఎవరైనా విస్తుపోతారు కదా? నిజంగానే సింగపూర్‌ కన్సార్టియం ఆదాయ ప్రతిపాదనలు లాభదాయంగా ఉంటే సరే, లేకుంటే లాభదాయం కాదనిపిస్తే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే జరిగితే రద్దు చేస్తామనే ఏజి వాదన ప్రకారం ఇంతవరకు జరిగిన ప్రక్రియ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా? అదే ఆదాయ వివరాలు ముందుగానే తెలుసుకుని ఉంటే కాలంతోపాటు ఖర్చులు కలిసివస్తాయి కదా? పారదర్శకంగా ఉన్నట్టు అవుతుంది కదా? నేటి వరకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదని ఏజి చెబుతున్నదాన్ని బట్టి, ఆయన కోరుతున్నట్టుగా సింగిల్‌ జడ్జి విధించిన స్టే ఉత్తర్వుల్ని ఎత్తేస్తే. ప్రభుత్వం నేరుగా సింగపూర్‌ కన్సార్టియంతో ఒప్పందం చేసుకునేందుకు అడ్డుంకులు లేనట్టే అవుతుంది కదా? ఆదాయం ఎంత రావచ్చునో అంచనా లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ అంచనాలతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోతే ఏం చేస్తారు? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాల్ని రహస్యంగా ఎందుకు ఉంచాలి? గోప్యంగా ఉంచాలని చట్టం ఏమైనా ఉందా? ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ అయినా బిడ్‌ దాఖలు చేస్తుందా? ఇలా పలు ప్రశ్నలతో హైకోర్టు సర్కార్‌ను నిలదీసింది.

18.అగ్రిగోల్డ్ దోపిడీ

2015 లో అగ్రిగోల్డ్ పేరిట 570 కోట్ల డబ్బు బ్యాంకులో ఉందని చెప్పిన టీడీపీ ప్రభుత్వం తరువాత కేవలం 6 లక్షలు ఉన్నాయి అని కోర్ట్ కు ఎందుకు చెప్పింది? అంటే ఈ లోపులో అగ్రిగోల్డ్ యాజమాన్య డబ్బులు డ్రా చేసుకొనేదాకా ఆగారా?

మొదట్లో ఏమ్ ఫర్లేదు ,అగ్రిగోల్డ్ పేరిట 10 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి , డిపాజిటర్లకు చెల్లించాల్సింది 4 వేల కోట్లే అని చెప్పిన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?

AP ప్లానింగ్ వైస్ చైర్మన్ అయిన చెరుకూరి కుటుంబరావు గతం లో రిజిస్టర్ వాల్యూ ప్రకారం అగ్రిగోల్డ్ ఆస్తులు 8 వేల కోట్లు కానీ నిజమైన విలువ ఇంకా ఎక్కువే అని చెప్పాడు కదా అటువంటప్పుడు ఆ ఆస్తులేవో దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వమే తీసుకొని డిపాజిటర్లకు డబ్బు చెల్లించొచ్చు కదా ?

లేదు అంటే 1100 కోట్లు చెల్లిస్తే AP లో ఉన్న 19 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల్లో పు 80 శాతం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీరుతాయి కదా, కనీసం ఆ ఆసొమ్ము అన్న ఇవ్వొచ్చు కదా ??

పుష్కరాలకు 4 వేల కోట్లు , షోకులకు ప్రత్యేక విమానాలకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన బాబు కు ఈ 1100 కోట్లు ఒక లెక్కా?

మొదట్లో అగ్రిగోల్డ్ కొనటానికి ముందుకు వచ్చిన జీ గ్రూప్ వాళ్ళు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు అడిగితె సరిగా సమాధానం చెప్పడం లేదు అని కోర్ట్ ఫిర్యాదు చేస్తే కోర్ట్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది నిజం కాదా? కొనడానికి ముందుకు వచ్చిన వాళ్ళను ఇబంది పెట్టడం కాదా ?

అంటే మీరు స్వాహా చేయడం కోసమే వారికి సరి అయిన సమాధానాలు ఇవ్వడం లేదనే కదా !!!

మంత్రి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములు కొన్నది వాస్తవం కదా, బినామీల ద్వారా మంత్రి లోకేష్, మంత్రి దేవినేని ఉమా కొన్నది వాస్తవం కాదా?

సిబిఐ విచారణకు ఆదేశిస్తే మొత్తం ఆస్తులు బయటకి వస్తాయి అని BJP వాళ్ళు అడుగుతుంటే నహీ అని వణికి పోతుంది టీడీపీ పెద్దలు కాదా?

10 వేల కోట్ల ఆస్తులున్నాయి అని చెప్పిన టీడీపీ మంత్రులు ఇప్పడు 2 వేల కోట్లే అని చెప్పడాన్ని బట్టి చొస్తే మిగిలిన 8 వేల కోట్లు శుభ్రంగా నాకేసారు అనే కదా అర్ధం?

19.బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టాడు అని రాష్ట్ర హై కోర్ట్ లో మారిషస్ బ్యాంకు వాళ్ళు కేసు వేసిన కూడా మోడీ మీద వత్తిడి తెచ్చి సుజనా చౌదరి కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది నీవు కాదా బాబూ

ఇప్పుడు సుజనా చౌదరి 6 వేల కోట్లు ఎగ్గొట్టాడు అని బ్యాంకులు ఫిర్యాదు చేస్తే ED కేసు నమోదు చేయలేదా?
మరి సుజనా చౌదరి CM రమేష్ నారాయణలు మీ బినామీలు కారా?

దాదాపు 5 వేల కోట్లు విలువ చేసే రాయలసీమ ఇర్రిగేషన్ పనులను బాబు తన బినామీ అయిన టీడీపీ MP CM రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చి నామినేషన్ సబ్ కాంట్రాక్టు పద్ధతిలో ఇచ్చారు

20.విద్యుత్ కొనుగోళ్లు
AP లో 10 వేల మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉన్నా కూడా మార్కెట్ లో దొరికే ధర కంటే రెండు రేట్లు ఎక్కువ చెల్లించి కొనడం వలన దాదాపు 20 వేల కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానా మీద పడుతుంది అంటే ఇందులో కమీషన్ లు బాబుకు

21.పుష్కరాలు
గోదావరి కృష్ణ పుష్కారాలు పేరిట 3 వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇందులో కనీసం 2 వేల కోట్లు అన్నా నొక్కేశారు
ఎందుకంటే 12 సం కొకసారి జరిగే పుష్కరాలు 2003 లో ఇదే బాబు సీఎం గా ఉన్నప్పుడు జరిగాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో బాబు పెట్టిన ఖర్చు 60 కోట్లు అని PCC ప్రెప్రెసిడెంట్ రఘువీరారెడ్డి చెప్పారు
మరి అప్పుడు 60 కోట్లు ఖర్చు పెడితే విడిపోయిన రాష్ట్రానికి ఇప్పుడు మహా అయితే 200 కోట్లకు మించి అవ్వదు

22.2009 -10 లో 35 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు ప్రకటించిన హెరిటేజ్ సంస్థ ఇప్పుడు లాభాల్లోకి ఎలా వచ్చింది?

23..తెలంగాణ లో ఇసుక ద్వారా 3 వేల కోట్ల ఆదాయం వస్తే గుజరాత్ తరువాత అతి పెద్ద కోస్తా తీరం ఉన్న AP లో 10 వేల కోట్ల ఆదాయం రావాలి కానీ దోచేస్తున్నారు

24.నీరు చెట్టు పధకం క్రింద 15 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పి సొంత మనుషులకు నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చి మొత్తం తినేశారు

25.పేద బ్రాహ్మణులకు కోసం ఇచ్చిన వెయ్యి కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూములను కూడా కోటేయడానికి ప్రయత్నించారు

26.చివరగా బాబు సీఎం అయినా ఈ నాలుగేళ్లలో కొత్తగా చేసిన అప్పులు దాదాపు లక్ష 50 వేల కోట్లకు చేరింది
మరి ఇంత అప్పు చేసి రాజధాని కట్టాడా , పోలవరం కట్టాడా? లేదే మరి ఆ డబ్బు ఏమయినట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -