Thursday, April 25, 2024
- Advertisement -

వైఎస్ఆర్‌సీపీలోకి 70 మంది టీడీపీ ఎమ్మెల్యేలు! ఎందుకంటే?

- Advertisement -

వైఎస్ఆర్‌సీపీలోకి టీడీపీ నేత‌లు క్యూ క‌ట్ట‌డం వెనుక అస‌లు కార‌ణం తెలిసిపోయింది. ఇప్ప‌టికే విజ‌యం మీద అంతంత మాత్రం అంచ‌నాలు ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు చెప్పిన ఓ వార్త విని త‌మ త‌ట్టా బుట్టా సర్ధేసుకొవ‌డానికి సిద్ధంగా టీడీపీ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది.

ఇంత‌కి చంద్ర‌బాబు చెప్పిన ఆ వార్త ఎంటంటే… రానున్న ఎన్నిక‌ల్లో నారా చంద్ర‌బాబుగారి ఏకైక కుమారుడు నారా లోకేష్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌. ఈ వార్త విన్న తెలుగు త‌మ్ముళ్లు కాసేపు షాక్‌లో ఉండిపోయార‌ట‌. తాము వింటున్న‌ది నిజ‌మే అని క్లారిటీ వ‌చ్చాక.. ఈ నిర్ణ‌య‌మేంట‌ని ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తే నా మాటే శాస‌న‌మ‌న్న లెవ‌ల్‌లో త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించార‌ట‌.

నారా లోకేష్‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా లేనందునే దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాము.. ఇప్పుడు ఈ నిర్ణ‌యం ఏంట‌ని తెలుగు త‌మ్ముళ్లు తెగ మ‌ద‌న‌ప‌డిపోతున్నారు. ఇప్ప‌టికే గెలుస్తామా లేదా అన్న మీమాంస‌లో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌కు ఈ నిర్ణ‌యం ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ చందంగా ఉందంటున్నారు.

వైఎస్ఆర్‌సీపీ క‌నుక లోట‌స్‌పాండ్ డోర్ల‌ను బార్ల తెరిచి టికెట్ ఇస్తామ‌ని హామీ ఇస్తే 70 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఓ రిపోర్ట్ చంద్ర‌బాబుకు అందింద‌ని ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయినా కాని చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని స‌మాచారం. ఎవ‌రు పార్టీ మారినా లోకేష్ బాబే 2019 ముఖ్యమంత్రి అభ్యర్థి అని సీనియర్ నేతలకు నొక్కి చెప్పార‌ట చంద్ర‌బాబు. ఒక‌రు పోతే వంద మందిని నాయకులను తయారు చేస్తా.. మీరేం వ‌ర్రి అవ‌ద్ద‌ని స‌మావేశాల్లో చెబుతున్నార‌ట చంద్ర‌బాబు. మ‌రి చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యాన్ని అధికారికంగా ఎన్నిక‌ల ముందు వెలువ‌రిస్తారా? లేక గెలిచాక ప్ర‌క‌టించాల‌నుకుంటున్నారా? ఏమో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -