దేవుడా………. అడ్డంగా దొరికేసిన బాబు…. ఎగ్జిట్ పోల్స్‌లో యూటర్న్

1324
Chandrababu Uturn in Exit Polls
Chandrababu Uturn in Exit Polls

ఏ ముహూర్తాన వైకాపా నేత, ఎంపి విజయసాయిరెడ్డి యూ టర్న్ అంకుల్ అని అన్నాడో కానీ చంద్రబాబు ఆ పేరుకు ప్రతిసారీ న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి అడ్డంగా బుక్కయ్యి నెటిజనుల చేతులో కామెడీ అయిపోతున్నాడు. ప్రత్యేక హోదాతో సహా చాలా విషయాల్లో చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలందరితో పాటు దేశప్రజలు కూడా చూస్తున్నారు. ఆ ఎఫెక్ట్‌తోనే తెలంగాణాలో రెండు సార్లు టిడిపికి ఘోర పరాభవం ఎదురైంది. ఇక జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు, లోకేష్‌లు. అయినప్పటికీ ఇద్దరూ ఏమీ మారలేదు.

తాజాగా ఎగ్జిట్ పోల్స్ గురించి చంద్రబాబు రకరకాలుగా మాట్లాడేశారు. మోడీ మేనేజ్ చేశాడని, డబ్బుతో కొనేశాడని, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజమైంది లేదని ఇష్టారీతిన మాట్లాడేశాడు. చంద్రబాబు ఇక్కడే అడ్డంగా దొరికేశాడు. కేవలం పచ్చ మీడియానే ఉంటే చంద్రబాబు మహా మేధావి……..ప్రపంచ మేధావి ……..ఆయన చెప్పాడంటే అంతా నిజమే అని ప్రజలను నమ్మించి ఉండేవాళ్ళేమో కానీ సోషల్ మీడియా పుణ్యమాని చంద్రబాబు అడ్డంగా దొరికపోయాడు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో మోడీ ఘనవిజయం, చంద్రబాబువిజయం అన్న రిజల్ట్స్ చూసిన తర్వాత పూర్తిగా మురిసిపోతూ ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలను ప్రతిఫలిస్తున్నాయని ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ ముక్తిభారత్‌ని ప్రజలు సాక్షాత్కారం చేశారన్న విషయం ఎగ్జిట్ పోల్స్‌లో తెలుస్తోందని మహదానందంగా ట్వీట్ చేశాడు. మరి 2014 ఎగ్జిట్ పోల్స్ అంత పవిత్రం, అన్నీ నిజాలు అయినప్పుడు 2019 ఎగ్జిట్ పోల్స్ అపవిత్రం, అబద్ధాలు అయిపోయాయా యూటర్న్ అంకుల్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా జనాలు చంద్రబాబును కామెడీ చేస్తున్నారు. ఏంటో చంద్రబాబు……….ఐదేళ్ళుగా పబ్లిసిటీ కామెడీ చేసి ప్రజలు తిరస్కరించే పరిస్థితి తెచ్చుకున్నాక కూడా అదే కామెడీ చేయడాన్ని తెలుగు తమ్ముళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా టిడిపి నాయకులే అంతర్గతంగా చెప్తున్నారు.

Loading...