చిరంజీవి, సురేఖల పెళ్లి గురించి ఎవరికి తెలియని నిజాలు..!

1492
chiranjeevi surekha marriage details
chiranjeevi surekha marriage details

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా చిరంజీవి కొనసాగుతున్నారు. చిరంజీవి భార్య సురేఖ గారు అల్లు రామలింగయ్య గారి కూతురు అన్న విషయం తెలిసిందే. అన్యోన్య దంపతులలో చిరు- సురేఖ ముందు వరుసలో ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో వారి పెళ్లి విషయాలను తెలియజేశారు. ఈ సంగతుల్ని చిరంజీవి చెబుతూ.. ” నేను చెన్నైలో ఉన్నప్పుడు కోడంబాకం బ్రిడ్జ్ పై నా కారులో వెళుతున్నాను. అప్పుడు నా క్లాస్ మేట్ సత్యనారయణ కనిపించాడు. ఎక్కడికి అని అడిగాను. అతను మా పెదనాన్న గారి ఇంటికి అన్నాడు. సరే నా కారులో దిగబెడుతాను అని చెప్పాను.

వాళ్ళ పెదనాన్న ఎవరో కాదు.. అల్లు రామలింగయ్య గారు. అప్పటికి నేను ఆయనతో మూడు సినిమాల్లో నటించాను. మా పెదనాన్నతో కలిసి నటించావుగా..లోపలికి రా.. కాఫీ తాగి వెళ్లు అని సత్యనారయణ పిలిచాడు. ఆ టైములో రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ, కుటుంబ సభ్యులు ఉన్నారు. సురేఖే కాఫీ పెట్టి ఇచ్చింది. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ఆ అబ్బాయి ఎవరు ? అని సురేఖ మా ఫ్రెండ్ తో ఆరా తీసిందట. ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు నా గురించి ఆరా తియ్యడం మొదలు పెట్టారని తెలిసింది. నేను బాగా చదువుకున్నానని, చెడు అలవాట్లు లేవని నా ఫ్రెండ్ సత్యనారయణ.. అల్లు అరవింద్ తో చెప్పాడట. చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయని తెలిపాడట నా ఫ్రెండ్. పలువురు నిర్మాతలని కూడా నా గురించి అడిగి తెలుసుకున్నారట అల్లు రామలింగయ్య గారు. ఆ తర్వాతే మా ఫ్యామిలీని సంప్రదించారని తెలిసింది. నేను మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాను. కానీ అల్లు రామలింగయ్య గారు మా నాన్నని బలవంతపెట్టారు. అలా పెళ్లి చూపులకు వెళ్లాం” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

సురేఖ మాట్లాడుతూ.. “ఆయను బయట చూడటం కంటే ముందు మనవూరి పాండవులు చిత్రంలో చూశాను. ఈ అబ్బాయి చాలా బావున్నాడు..పెద్ద కళ్ళు, గుండ్రంగా ఉన్నాయి అని అనిపించింది. మా నాన్న గారు కూడా నటుడే.! నేను కూడా నటుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకునే దాన్ని. అలా చిరంజీవితో పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. అలా సరదా సరదా సంఘటనల మధ్య మా పెళ్లి జరిగింది. ఇక అత్తారింట్లో అడుగు పెట్టక వారందరినీ చూసి నేను షాక్ అయ్యాను. వాళ్లంతా ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. నాతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ నాతో చాలా అభిమానంగా ఉండేవాడు. మా పిల్లలతో పాటే పెరిగాడు” అంటూ సురేఖ చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..!

ఈ హాలీవుడ్ హీరో ఇక్క పోస్ట్ పెడితే 7కోట్ల 58 లక్షల తీసుకుంటాడు..!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

Loading...