Thursday, April 25, 2024
- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం- బాబు మార్క్ పాలిటిక్స్‌ ఏంటంటే?

- Advertisement -

చాలా చదివే ఉంటారు………చాలా చాలా తెలుసుకునే ఉంటారు. పచ్చ మీడియా ఎంత మేనేజ్ చేేసినా చంద్రబాబు రాజకీయాల గురించి తెలియనిదెవ్వరికి? కాకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం తెలియనట్టు నటిస్తూ ఇప్పటికీ కొంతమంది బాబు బాకా ఊదుతూ ఉన్నారు. ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేసి మొదటి సంతకానికి వైఎస్ తీసుకొచ్చిన క్రెడిబిలిటీని వాడుకుంటు రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం అని ఓట్లు కొల్లగొట్టిన బాబు…..అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం విషయంలోనే ఓటర్లను దారుణంగా వంచించాడు. ఇక ఆ తర్వాత నుంచీ నాలుగున్నరేళ్ళపాటు చంద్రబాబుది అదే రాజకీయం. మానవహక్కులతో సహా అన్ని విషయాల్లోనూ ప్రజలను దారుణమైన కష్టాలకు గురిచేశాడు. గ్రాఫిక్స్‌లో మాత్రం అద్భుతాలు చూపిస్తూ ప్రచారమాయ మాత్రం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుప్రమాదం లాంటి రాజకీయాన్ని నడుపుతున్నాడు. ఆ వైనంపై ఒక సీనియర్ విశ్లేషకుడి సమగ్ర వ్యాసం మీకోసం. చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందో మీరే తెలుసుకోండి.

అవును అతను ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయో వాటన్నింటికి గొడ్డలిపెట్టు లాంటివాడు చంద్రబాబు .

ఐదేళ్లు అవినీతి , అక్రమాలతో దోచుకొని ప్రజాధనం అత్యంత దుబారా చేస్తూ విలాసాలలో మునిగితేలి ఎన్నికల టైం దగ్గర పడగానే ఓట్ల కోసం బాబు చేసే అత్యంత నీచమైన హేయమైన పనులు చూస్తే ఔరా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఇతని బాటలో నడిస్తే ఆయా దేశాల మనుగడ ఏంటి .

ఆయా రాష్ట్రాల దేశాల నేతలు కూడా ఇలాగే ఐదేళ్లు దోచుకొని ఎన్నికల వేళ మాత్రమే కొత్త పథకాలు పెట్టి మూడు నెలలు మురిపించి ఓట్లు కొల్లగొట్టి మళ్ళీ దోచుకొని రాష్ట్రాన్ని గుల్ల చేసి ముందే సంబంధాలు పెట్టుకొన్న మరో విలాసవంతమైన దేశానికి చెక్కేసి దర్జాగా బతుకుతారు . కానీ ఇక్కడ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతుంది .

ఈ ఘనుణ్ణి ఆదర్శంగా తీసుకొని పలు పథకాలు అంటూ ప్రజల ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తన పార్టీ ఓట్లు కానీ వారిని ఓటర్ల లిస్ట్ లోనుండి తొలగిస్తే వారు ఉన్నట్టా సచ్చినట్టా వారి మనుగడ ప్రశ్నర్థకం కదా .

లక్షల కోట్లు అప్పులు చేసి ఉత్పదక రంగాల పై ఖర్చు పెట్టకుండా లెక్క చెప్పనవసరం లేని , వర్షాకాలం దాటిపోయినాక కనపడని పుష్కరాల పనులు వంటి వాటిపై వేల కోట్లు , నీరు మట్టి లాంటి దోపిడీ విధానాల పై వేల కోట్లు ఖర్చు చూపి దోచేసి చేతులు దులిపేసుకొనే విధానం ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయితే దేశాలు బతుకుతాయా .

ఐదేళ్ల పాటు తన సంపాదన చూసుకొని ప్రజాధనంతో తన విలాసాలు కోసం , ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ , కోట్ల వ్యయంతో స్టార్ హోటల్స్ లో కుటుంబ సమేతంగా నివాసం ఉండి , పదుల కోట్లతో సొంత కొంపలు ఆధునికీకరించుకొని , పలు ప్రారంభోత్సవాలు , దీక్షల పేరుతో దోచుకుతిని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేవాణ్ణి ఇతర రాష్ట్రాల అవినీతి పరులు ఆదర్శంగా తీసుకొంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుందా .

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఐదేళ్ల పాటు మర్చిపోయి కుటుంబ ఆర్జనే ధ్యేయంగా బతికి చివరి రోజుల్లో ఎన్నికల ముందు ఆ సాయం , ఈ సాయం అంటూ ప్రకటించి ఎన్నికలకు రోజుల , గంటల ముందు ప్రజాధనాన్ని ఓటుకి నోటు రూపంలో ప్రజల ఖాతాల్లో వేసే నయా వికృత క్రీడకు ఆద్యుడైన ఇతన్ని నికృష్ట రాజకీయనాయకులు అందరూ ఆదర్శంగా తీసుకొంటే ప్రపంచం నాశనమవ్వటానికి ఇంకేం కారణం కావాలి . మరో అణుయుద్ధం అవసర్లేదు . మరోసారి బాబును ఎన్నుకొంటే చాలు ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దుర్మార్గ రాజకీయ నాయకులు అన్ని చోట్లా దోచుకొని దేశాలని అల్లకల్లోలం చేసి అంతర్యుద్దాల దిశగా తీసుకువెళ్తారు .

దురదృష్టవశాత్తు కొందరు ఈ తాత్కాలిక హామీల , పథకాల , ఓటుకు ప్రభుత్వ ఖజానా నోటు మత్తులో పడొచ్చు కానీ నేటి సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు . ఆ చైతన్యం తాలూకూ ప్రతిఫలం ఈ ఎన్నికల్లో కనపడనుంది . కానీ ప్రతిపక్షాలు , ఓటర్లు మరింత జాగురుకతతో వ్యవహరించని పక్షంలో రాష్ట్రం మరో సోమాలియా అయ్యే ప్రమాదం ఎంతో దూరంలో లేదు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -