Friday, March 29, 2024
- Advertisement -

కరోనా ఎఫెక్ట్ : ఏటొచ్చి మిడిల్ క్లాస్ కే బాధ..!

- Advertisement -

కరోనా ఎఫెక్ట్ ఏ రెంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. అయితే కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. చిన్న ఉద్యోగస్తుడు నుంచి.. పెద్ద ఉద్యోగస్తుడి వరకు ఖాళీ సమయం గడపాల్సి వస్తుంది. ఊర్లల్లో పేదలు ఇంటికే పరిమితమయ్యారు. రోజు కూలీ చేసుకునేవారు డబ్బులు లేక అల్లాడుతున్నారు.

ఇక డబ్బులు ఉన్నవారు తమ సమయాన్ని ఇంట్లో వాళ్లతో గడిపేస్తున్నారు. ఇక్కడ కరోనా కారణాంగా అందరు ఇబ్బందులు పడుతున్నారు అనేది నిజం. కానీ ఇందులో ఎక్కువగా ఇబ్బంది పడుతుంది మాత్రం మిడిల్ క్లాస్ కుటుంబాలు. ఎందుకంటే పేదలకు డబ్బు ఉన్నవారు సాయం చేస్తున్నారు. అలానే ప్రభుత్వం కూడా వాళ్ళకు ఎలాంటి ఆకాలి బాధలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‍కు ముందు నుంచి తమ సొంత డబ్బుపై ఆధారపడి బ్రతకడం అలవాటు. కరోనా మహమ్మారి విజృబించిన సమయంలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి.

ఉదహారణకు హైదరబాద్ లో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ వీరు తమ సొంత డబ్బు మీదే ఆధారపడి బ్రతుకుతారు. ఉద్యోగం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తారు. ఇలాంటి వారు ఒకరి దగ్గర చేయి చాచా అడగలేరు. పోనీ వీరికి ఎవరైన హెల్ప్ చేస్తారా అంటే అది కూడా చేయరు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నావాడైన స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు.. తమకు తెలిసిన పేదలకు మాత్రమే సాయం చేస్తాడు. ఈ మధ్యతరగతి ఫ్యామిలీలో ఇప్పుడు అనుక్షణం భయం పట్టుకుంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వారి పరిస్థితి ఏంటో అర్దం కావడం లేదు.

ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులను తొలిగించోద్దు అని అదేశాలు ఇచ్చినప్పటికి తాము ఏం చేయాలేమని ఆ కంపెనీలు చేతులు ఎత్తేశాయి. ఇలాంటి సమయంలో మధ్యతరగతి కుటుంబాలు అందోళలోకి వెళ్లాయి. లాక్ డౌన్ అయిపోయే వరకు పరిస్థితి ఏంటి.. ఎలా ఉండాలి.. ఇంటి అద్దెలు ఎలా కట్టాలి.. లాక్ డౌన్ అయిపోయాక పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి.. ఇలాంటివి చాలానే సమస్యలు ఉన్నాయి. ఇక ఇంటి అద్దెలు వసులు చేయోద్దు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఇది ఎంత మంది పాటిస్తారు. నెలంత కష్టపడినా కొన్నిసార్లు ఆ డబ్బే సరిపోదు ఈ మధ్యతరగతి కుటుంబాలకు.

ఇప్పుడు డబ్బులు లేవు.. ఉద్యోగాలు లేవు.. ఈ మధ్యతరగతి కుటుంబాల సంగతి ఏంటో తెలియని పరిస్థితి వచ్చింది. ఏదైన సరే ప్రభుత్వాలు అండగా ఉంటాయి అంటున్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ మిడిల్ క్లాస్ వారు ప్రభుత్వాలకు ఏ సమస్య ఉన్న తెలియజాలని కొందరు కోరుతున్నారు. అలానే ఇంటి అద్దెలు వంటివి నెమ్మదిగా తీర్చేలా ఆ యాజమాన్యులు కూడా మానవత్వం చూపించాలి. ఇక ఉద్యోగస్థులు ఈ లాక్ డౌన్ అయ్యేవరకు ఉద్యోగాలు తీసేసినప్పటికి లాక్ డౌన్ అయిపోయాక తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అప్పుడే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాస్త బయటపడగలడు. లేకుంటే చాలా కష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -