Thursday, April 25, 2024
- Advertisement -

దాసరికి దేవి నాగవల్లి ఏమవుతుందో తెలుసా ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ 4లో దేవి నాగవల్లి చాలా యాక్టివ్ గా ఉంటూ గేమ్ ఆడుతోంది. ఎలాగైన విన్నర్ అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సీరియస్ గా సందర్బానుసారంగా స్పందిస్తూ అందర్ని ఆకట్టుకుంటుంది. టాప్ 4 కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా ఆమె ఉంటుందేమో అంటూ ఇప్పటి నుండి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఒక మీడియా సంస్థతో దేవి తల్లిగారు మాట్లాడుతూ తన కూతురు ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఇంట్లో ఎలా అయితే పోరాడిందో ఇప్పుడు అక్కడ కూడా అలాగే పోరాటం చేస్తుందన్నారు. ఆమె మాట్లాడుతూ.. నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో హౌస్ లో కూడా అలాగే ఉంటుంది. వాళ్ల నాన్న 2000వ సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్ని తనపైనే వేసుకుంది. ఆమె అన్నయ్య మరియు తమ్మడు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు అంటే ఆమె వల్లే.

మాది రాజమండ్రి మాకు దాసరి నారాయణ రావుగారి కుటుంబంతో బంధుత్వం ఉంది. దేవి నాన్న గారికి దాసరి నారాయణ రావు మేనమామ అవుతారు. అంటే దేవికి దాసరి నారాయణ రావు గారు తాత అవుతారు. అయితే ఆయన పేరును మేము ఎక్కడ ఎప్పుడు వాడుకోలేదు. సాయం పొందలేదు. వారింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వెళ్తూ ఉండేవాళ్లం. దేవి నాగవల్లి ఎన్నో బాధలు పడి ఈస్థాయికి వచ్చింది. తప్పకుండా ఆమెలోని పట్టుదల విజేతగా నిలుపుతుంది అంటూ తన కూతురు గురించి చెప్పుకొచ్చింది.

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -