అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

822
did you remember actress sandhya
did you remember actress sandhya

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన అన్నవరం అనే సినిమాలో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెల్లెలు గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది నటి సంధ్య. ఇప్పటికి ఈమెను తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.

అయితే సంధ్య కోలీవుడ్ లో దర్శకుడు బాలాజీ శక్తి వేల్ డైరెక్షన్ లో కాదల్ ( తెలుగులో ప్రేమిస్తే) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాకి తమిళ, తెలుగు భాషల్లో మంచి హిట్ కావడంతో సంధ్యకు మంచి పేరు వచ్చింది. సంధ్య కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో పుట్టి పెరిగింది. అలానే చెన్నైలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో పలు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది. అలా హీరోయిన్ గా కాదల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో రాణిస్తున్న టైంలో తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని సంధ్య పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం నటి సంధ్య కి ఒక పాప కూడా ఉంది. దీంతో నటి సంధ్య ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చక్క బెట్టుకునే పనిలో పడింది. అయితే పెళ్లయిన తర్వాత నటి సంధ్య సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది. కాగా ప్రస్తుతం నటి సంధ్య కుటుంబ సభ్యుల తో కలిసి చెన్నైలో ఉంటుంది. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య సంధ్య మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్ అక్క పాత్రకు సంధ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

కరోనా తో కుప్పకూలుతున్న జీవితాలు

బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

Loading...