Friday, April 19, 2024
- Advertisement -

త్రివిక్రమ్ అడ్డంగా దొరికాడు.. అన్ని సీన్లు కాపీనే..!

- Advertisement -

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువ గా వినిపిస్తున్న పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సినిమాల్లోని సీన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఉంది. కొన్ని హాలీవుడ్ సినిమాల నుండీ సీన్స్ లేపి ఆయన సినిమాల్లో పెట్టుకుంటున్నాడని త్రివిక్రమ్ ను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఆ లిస్టు లో ‘అతడు’, ‘జులాయి’, ‘ఖలేజా’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు ఉన్నాయి. అతడు సినిమాలో శివారెడ్డి ని కాల్చిన తర్వాత హీరో బిల్డింగ్ మీద నుండీ ట్రైన్ పైకి దూకే సీన్, ‘ఖలేజా’ లో ప్రకాష్ రాజ్ కి అమిత్ కు మధ్య షుగర్ ఫ్యాక్టరీ డిస్కషన్ సీన్. అలాగే ‘జులాయి’ లో బ్యాంక్ రోబరీ సీన్, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందం అబద్దాలు ఆడితే ఆకులు రాలిపోయే సీన్, ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమా అయితే స్టోరీ మొత్తం కాపీ కొట్టేసాడు గురూజీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. రాజమౌళికి కూడా హాలీవుడ్ సినిమాలోని సీన్స్ ని కాపీ చేస్తాడని విమర్శలు చేసేవారు ఉన్నారు. ఇప్పట్లో చాలా స్టోరీ లైన్ లు హాలీవుడ్, కొరియన్ సీన్ల నుండీ లేపేస్తారు అని మొదటి నుండీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.

కుర్ర డైరెక్టర్లు కూడా చాలా వరకూ ఇదే ఫార్ములా ని అప్లై చేస్తున్నారు అన్నది బహిరంగ రహస్యమే. ఇక తమిళ దర్శకులు కూడా ఇలాంటివి చేస్తుంటారు. ఏ.ఆర్.మురుగ దాస్ తీసిన స్పైడర్ కాన్సెప్ట్ కూడా హాలీవుడ్ సినిమా నుంచి లేపిందే. అయితే త్రివిక్రమ్ ఎక్కువగా కాపీ కొట్టడం వల్ల నెటిజన్లకు దొరికిపోయాడు. గురూజీ ఏమో అనుకున్నాం కానీ కాపీ మాస్టర్ అని ఇప్పుడు అర్దం అయిందని నెటిజన్లు త్రివిక్రమ్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -