ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ యాక్సెఫ్ట్ చేస్తే మీ పని ఫట్..!

1340
Dont Accept Friend Requests in Facebook
Dont Accept Friend Requests in Facebook

మోసం చేయడానికి కొందరు బతుకున్నారు. మరికొందరు మోసపోవడానికే బతుకుతున్నారు. ఎలాంటి లాటరీ టికెట్టు కొనుగోలు చేయకపోయినప్పటికి.. మీ గురించి అవతలి వ్యక్తికి తెలియకపోయినా.. మీకేదో భారీ ఫ్రైజ్ వచ్చేసిందని చెప్పగానే నమ్మేస్తుంటారు.. మోసపోతూ ఉంటారు. సైబర్ నేరస్థులు గతంలో చాలాసార్లు అమాయకు ప్రజలను మోసం చేసిన సంఘటనలు చాలానే చూశాం.

లాటరీ విన్నర్ అంటూ ఫోన్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. సింపుల్ గా నమ్మించి మోసం చేస్తున్నారు. ఉదహారణకు ఓ వ్యక్తి మీరు లాటరీలో కారు గెలుకున్నారని చెబుతాడు. కాకపోతే తమకు ఆఫర్ కింద పది శాతం డబ్బులు పంపిస్తే.. మీ ఇంటికే కారు వస్తోందని చెబుతాడు. ఇలా నమ్మి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక బ్యాంక్ కు సంబంధించిన వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దని పదే పదే అధికార్లు చెబుతూ ఉంటారు. అయినప్పటికి ఈ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ అకౌంట్ డిటెల్స్ చెబితే లాటరిలో తగిలిన పది లక్షలు మీ అకౌంట్ కి పంపిస్తాం అని చెప్పి.. వారి వివరాలు తీసుకుని వారి అకౌంట్ లో ఉన్న డబ్బును నొక్కేస్తున్నారు. ఇలాంటివి రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. ఇక కొత్తగా ఫేస్ బుక్ లో నాయ దందా మొదలైంది. కొందరు కర్శియల్ గా ఇది చేస్తే.. మరి కొందరు మోసం చేయడానికే పనిగట్టుకుని కూర్చున్నారు.

ఫేస్ బులో మనకు కొన్ని పోస్ట్ లు కనిపిస్తాయి. లాటరీ పది లక్షలు ఇప్పుడే క్లిక్ చేసి మీ పేరు నమోద్ చేసుకోండి అని. మరికొందరు మీకు లాటరీ కావాలంటే మా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మీ డిటైల్స్ పంపండి అని మోసం చేస్తున్నారు. నిజంగానే పది లక్షలు వస్తాయని నమ్మి తమ డిటైల్స్ మెయిల్ ఐడీ, బ్యాంక్ డిటైల్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డిటైల్స్ అన్ని పంపించేసి తర్వాత తల పట్టుకుంటున్నారు. ఇక మరికొందరు జాతకాలు చెబుతాం అని ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టి.. మెసేంజర్ లో మెసేజ్ చేస్తున్నారు. మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీరు మాకు 100 రూపాయలు పంపిస్తే మీ జాతకం ఎలా ఉందో చెబుతాం అంటూ డబ్బు దొచుకుంటున్నారు. ఇవన్ని నిజం అని నమ్మిన కొందరు మోసపోతున్నారు. సో ఫేస్ బుక్ లో కనిపించే ఫేక్ రిక్వేస్ట్‌లు.. ఫేక్ లింక్ లు యాక్సెఫ్ట్ చేయకుండా ఉంటే మంచిది.

Loading...