Thursday, April 25, 2024
- Advertisement -

‘ఓట్ ఫర్ జాబ్’ 13 కోట్లమంది నినాదం

- Advertisement -

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ అంశం ప్రధాన అస్త్రంగా మారబోతోందో తెలుసా ? నిరుద్యోం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏ నాయుకులు, పార్టీ అయితే స్పష్టమైన హామీ ఇస్తుందో ? ఆ పార్టీ, నేతలకే దేశం పట్టంకట్ట బోతోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో కీలక అంశాలు బయటపడ్డాయి. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగం నాయకులకు పెను సవాల్ విసరబోతోంది. రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతరం 13 కోట్ల మంది ఉన్నారు. వాళ్లంతా ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నది ఒక్కటే. ‘ఉద్యోగం’. ఎవరైతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇస్తారో…వాళ్లే మా వద్దకు రండి. మా ఓటు అండగండి అని కొత్త తరం చెబుతోంది. ‘ఓట్ ఫర్ జాబ్’ నినాదంతో హోరెత్తిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ మోడీ కోటి ఉద్యోగాలు ఇస్తానంటూ హామి ఇచ్చారు. కానీ ఆ హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో మోడీపై అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. అది 22 శాతం నుంచి 29 శాతానికి ఎగబాకింది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 18 నుంచి 25 ఏళ్ల వారే 68 శాతం మంది ఉన్నారని, సెంటర్ ఫర్ దీ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసొటీ తేల్చింది. వీళ్లంతా నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నవారే. ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఈ నిరుద్యోగ సమస్య మరింత పెరిగి మోడీని ఓడించడం ఖాయమనే విశ్లేషణలు ఊపందుకున్నాయి,

ఇటు ఏపీలోనూ గత ఎన్నికల్లో చంద్రబాబు బాబు వస్తేనే జాబు నినాదంతో అధికారం దక్కించుకున్నారు. పోలీస్, టీచర్లు వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలను రప్పించడంలోనూ, ఎంఓయూలు కుదుర్చుకోవడంలోనూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నారు. హోదా ఇచ్చి ఉంటే ఉద్యోగాల జాతర మొదలయ్యేది. కానీ మోడి చేసిన మోసం వల్ల చంద్రబాబుకూ నిరుద్యోగ సమస్య సవాల్ విసురుతోంది. అటు జగన్ కూడా తాను అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. నవరత్నాలు పేరుతో అన్నివర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన ప్రధాన హామీ నిరుద్యోగులు, విద్యార్థులకు ఏం ఇచ్చారన్నదే ప్రశ్న. ప్రత్యేకహోదా సాధిస్తాం, ఉద్యోగాల విప్లవాన్ని సృష్టిస్తామంటున్నారు. మరి జగన్ హామీలు యువతకు ఎంతవరకూ నమ్మకం కలిగిస్తాయో చూడాలి. ఇటు కాంగ్రెస్ కూడా ఏపీకి హోదా బాకీ తీర్చేస్తాం. తద్వారా పెట్టుబుడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వెళ్లువెత్తుతాయి అని రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా చెబుతున్నారు. అటు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని విమర్శలు పోటెత్తుతున్నాయి. ఏ ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వని ఘనత కేసీఆర్ సర్కార్ దే అని నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. ఆ ప్రబావం ఎన్నికల్లో తప్పక పడుతుందని స్పష్టమవుతోంది.

సో ఎటు చూసినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ ‘ఉద్యోగం’. ఎవరైతే ఎంప్లాయి్ మెంట్ కల్పిస్తామని నమ్మకం కలిగిస్తారో వారికే అధికారం. లేదంటే పరాజయం. యువత అందుకే అంటోంది ఉద్యోగాలు ఇస్తారా ? చస్తారా ? అని. మరి నేతలేమంటారో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -