జబర్దస్త్ నరేష్ గురించి షాకింగ్ నిజాలు…!

1538
Facts Behind Jabardasth Naresh
Facts Behind Jabardasth Naresh

జబర్దస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో కొట్టే మరో షో రాలేకపోయింది. బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది జబర్దస్త్. ఈ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న కమెడీయన్ నరేష్. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా ఆయ‌న కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తనదైన కామెడీ పంచులతో బాగా నవ్విస్తాడు. మూడడుగులే ఉంటాడు కానీ టీం లీడర్స్ కే ముచ్చెమటలు పట్టిస్తాడు.

అలాంటి నాటి నరేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. కానీ అదే అతడికి వరమైంది. పదేళ్ల బాలుడిలా ఉండే నరేష్ వయసు 20 ఏళ్లు. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్ కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఢి షోకు ఎంపికయ్యాడు. అక్కడ్నుంచి ఈ కుర్రాడి ప్రయాణం మొదలైంది. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు. ఆ తర్వాత ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చాక అతని జాతకం మారింది. మంచి కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రధానంగా తన పంచులతో తెగ నవ్విస్తాడు. జబర్దస్త్ కోసం అంతా స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి, స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే తెలుసుకుంటాడు. తర్వాత స్టేజ్‌పై పర్ఫార్మ్ చేస్తుంటాడు. ఇది నరేష్ కు ఉన్న టాలెంట్ అంటూ చాలా సార్లు బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు ఎంతో పేరు వచ్చిందని భాస్కర్ చెప్పాడు. ఇక నరేష్ మిగిత టీంలో కూడా చేస్తూ ఉంటాడు. జబర్దస్త్ లో చేసాక తన సొంత ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు నరేష్.

Loading...