Tuesday, April 16, 2024
- Advertisement -

ఫాస్టుఫుడ్ తింటున్నారా ? ఇక సెక్స్ విషయంలో దెబ్బే..!

- Advertisement -

ప్రస్తుతం కాలానికి సంబంధించి ఆహారం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఎవరికీ వాళ్లు బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయారు. దాంతో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. తక్కువ టైంలో తయారుచేసే రెడీమెడ్ ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. ఫాస్టు ఫుడ్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి వారిపై ఓ పరిశోధన సంస్థ రీసెర్చ్ చేసి తాజాగా వెల్లడించిన విషయాలు ప్రతీ ఒక్కరిని షాక్ కు గురి చేస్తోంది.

ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ కారణంగా ఎక్కువ మంది ఫాస్టు ఫుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సెర్మ్(వీర్యం) కౌంట్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో తెలింది. 19ఏళ్ల సగటు వయస్సున్న 2900మందిపై పరిశోధన చేపట్టి తాజాగా వివరాలను వెల్లడించారు. పిజ్జా ప్రెంచ్ ప్రైస్ బీఫ్స్ స్నాక్ షుగరీ బేవరీ ఐటమ్స్ పాలిష్ చేసిన బియ్యం స్వీట్స్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ గా ఉన్నట్లు వెల్లడైంది. అలానే చేపలు, చికెన్, కూరగాయాలు, పండ్లు, నీళ్లు వంటి ఎక్కువగా తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉన్నట్లు తెలింది.

ఫాస్టుపుడ్ తీసుకునే ఆడవాళల్లోనూ అండోత్పత్తి(ఫెర్టిలిటీ) సమస్య ఏర్పడుతుందని తెలిపింది. డైట్ తోపాటు స్మోకింగ్ రేడియేషన్ ఫెస్టిసైడ్ బంగారం స్టీల్ చైన్లు వెండి వస్తువులు భారీగా ధరించడం కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. ఫాస్టుఫుడ్ ఇష్టంగా తినేవారు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. సంతానం కోసం పరితపించే వాళ్లు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. ఇప్పటికైన ఫాస్టు ఫుడ్ వంటివి వదిలేసి మంచి ఆహార పదార్దాలు తీసుకోవడం మంచిది పలువురు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -