Thursday, April 25, 2024
- Advertisement -

FAU-G గేమ్ లో ఆసక్తికర ఫీచర్స్ ఇవే..!!

- Advertisement -

పబ్ జీ ప్రత్యామ్నాయంగా ఇటీవలే సినీ నటుడు అక్షయ్ కుమార్ FAU-G అనే గేమ్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.. కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా పబ్ జీ ని కూడా ఇండియా లో బ్యాన్ చేశారు.. దాంతో ఇండియా లో అలాంటి యాప్ ఒకటి ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది.. ఈ నేపథ్యంలో FAU-G అనే గేమింగ్ యాప్ ని పెద్ద ఎత్తున లాంచ్ చేశారు. అక్టోబ‌ర్‌లో ఓ గేమ్‌ను లాంచ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో గేమింగ్ ప్రియులు ఇప్పుడా గేమ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే FAU-G గేమ్‌కు సంబంధించి 5 ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

  • FAU-G అనేది ప‌బ్‌జి లాగే మల్టీ ప్లేయ‌ర్ యాక్ష‌న్ గేమ్‌. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఇందులో ప్లేయ‌ర్ల‌కు కావ‌ల్సినంత‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ల‌భిస్తుంది. అలాగే దేశం కోసం త్యాగం చేసిన అమ‌ర సైనికుల విష‌యాలు ఈ గేమ్ ద్వారా గేమ‌ర్ల‌కు తెలుస్తాయి.
  • గేమ్‌లో ముందుగా మొద‌టి లెవ‌ల్‌లో గాల్వ‌న్ లోయ‌ నేప‌థ్యంలో ఆట కొన‌సాగుతుంది. త‌రువాత విడ‌త‌వారీగా గేమ్‌ను డెవ‌ల‌ప్ చేస్తారు. మ‌రిన్ని లెవ‌ల్స్ ను గేమ్‌లో అందిస్తారు. అందులో థ‌ర్డ్ ప‌ర్స‌న్ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ పొంద‌వ‌చ్చు. ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలు రెండింటిపై విడుద‌ల చేస్తారు.
  • FAU-G అంటే.. Fearless and United: Guards అని అర్థం వ‌స్తుంది. భార‌త సైనికులు శ‌త్రు దేశాల సైనికుల‌తో పోరాడిన తీరు ఆధారంగా గేమ్‌ను రూపొందిస్తున్నారు.
  • ఈ గేమ్ ద్వారా వ‌చ్చే మొత్తం ఆదాయంలో 20 శాతాన్ని భార‌త్ కే వీర్ ట్ర‌స్ట్‌కు అంద‌జేస్తారు. ఈ ట్ర‌స్ట్ అమ‌ర సైనికుల కుటుంబాల‌కు ప్ర‌స్తుతం స‌హాయం చేస్తోంది.
  • ఎన్‌కోర్ గేమ్స్ అనే కంపెనీ ఈ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేస్తోంది. పూర్తిగా ఇన్‌-డెప్త్ ఎక్స్‌పీరియెన్స్ తో ఈ గేమ్‌ను రూపొందిస్తున్నామ‌ని ఆ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, చైర్మ‌న్ విశాల్ గొండ‌ల్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -