ఒక రాత్రికి కక్కుర్తి పడ్డాడు…చివరకు ఆసుపత్రి పాలయ్యాడు

2385
German Man hospitalised permanent erection
German Man hospitalised permanent erection

ఏదైనా మితంగా తీసుకుంటె ఎవరికైనా ఎలాంటి సమస్యలు రావు. కాని అమితంగా తీసుకుంటె ఇబ్బందులు పడాల్సిందే. అది తిండి విషయం కావచ్చు..పని విషయం కావచ్చు.. ఆఖరికి శృంగారమైనా కావచ్చు. తన భాగస్వామితో ఎక్కువసేపు శృంగారం ఇరగదీయాలనుకున్న యువకుడు చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. వ్యవహారం ఇప్పుడెక్కడి వరకూ వచ్చిందంటే.. జీవితంలో మళ్లీ సెక్స్ చేసే అవకాశం ఉందా? అన్న వేదనే కాదు.. ఆసుపత్రికి అయ్యే వైద్య ఖర్చుల కోసం ఆన్ లైన్ లో విరాళాలు సేకరించాల్సిన దుస్థితి దాపురించింది.

వివరాల్లోకి వెల్తే…డాని పొలారిస్ అనే జర్మన్ యువకుడికి సెక్స్ ఆలోచనలు ఎక్కువ. కొద్ది రోజుల క్రితం ఒక నర్సుతో సెక్స్ పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. శృంగారం ఎక్కువ సేపు చేయాలన్న ఆశతో వయాగ్రాతో పాటు ఇంజెక్షన్ తీసుకున్నాడు. దీర్ఘ అంగస్తంభన కోసం చేయించుకున్న వయగ్రా ఇంజెక్షన్ దెబ్బకు దిమ్మతిరిగి పోయింది. పురుషాంగం మళ్లీ సాధారణ స్థితికి రాలేదని, అలాగే స్తంభించి ఉండిపోయింది.

రెండు రోజులు దాటినా అంగం స్తంభించే ఉండేసరికి తీవ్రమైన నొప్పితో బాధపడ్డానని.. ఇక భరించలేక ఆస్పత్రిలో చేరానని డానీ చెప్పాడు. రెండు రోజులు దాటినా కూడా అంగం స్తంభించిపోయి ఉండడటం.. నార్మల్ కండిషన్ లోకి రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాడు. ఇప్పటికే డాక్టర్లు ఐదు సార్లు అంగంలో చేరిన రక్తాన్ని సూదితో వైద్యులు తీసినా నార్మల్ కాలేదు.

వైద్యులు దీన్ని ‘ప్రియాపిజమ్’ అనే సమస్యగా చెప్పారు. తాను ఇంజెక్షన్ తీసుకోకుండా ఉండాల్సిందని.. తన జీవితంలో దీనికి మించిన చెత్త పని మరొకటి లేదని వాపోతున్నాడు. జీవితంలో మళ్లీ సెక్స్ చేస్తానో లేదోనని ఆవేదన చెందుతున్నట్టు తెలిపాడు. డానీ ఆస్పత్రి ఖర్చుల కోసం అతని స్నేహితులు ఆన్‌లైన్‌లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు.

Loading...