Friday, March 29, 2024
- Advertisement -

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

- Advertisement -

కరెక్ట్ టైం కి బోజనం చేయటం, త్వరగా పడుకోవడం వంటు అలవాట్లు మనకు ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితపరుస్తాయి. రాత్రి త్వరగా బోజనం చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

‘ఏ సమయమైన ఆహర సేకరణకు మంచిదే’ అనుకుంటే మీ ఆలోచన తప్పని చెప్పవచ్చు. మన శరీరానికి సమయానికి భోజనం మరియు నిద్రవంటివి లయబద్దంగా అవసరం. సమయానికి తినటం లేదా పడుకోవటం మరియు ఆరోగ్యానికి మధ్య గల సంబంధం గురించి అధ్యయనాలు జరిపారు. ఎర్లీ డిన్నర్ లేదా రాత్రి భోజనం త్వరగా చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది. 

రాత్రి ఆలస్యంగా భోజనం లేదా స్నాక్స్ తినటం వంటి కార్యాలు మన నిద్రను భంగానికి గురి చేస్తాయి. ఈ అలవాట్లు అజీర్ణం వంటిని కలుగచేసి, రాత్రిళ్ళు వివిధ రకాల సమస్యలకు కారణమవుతాయి. రోజు రాత్రి సమయంలో నిద్రాభంగం ఉంటే, రాత్రి భోజనాన్ని త్వరగా ముగించండి. రాత్రి సమయంలో మితిమీరిన స్థాయిలో తినటం వలన కూడా నిద్రకు భంగం కలగవచ్చు.

గుండెమంట, ఆసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? రోజు ఒకే సమయంలో కాకుండా, వివిధ సమయాలలో రాత్రి భోజనం చేయటం వలన కావచ్చు. రాత్రి భోజనం తిన్న తరువాత త్వరగా పడుకోవటం వలన మన శరీరంలో ఆహరం జీర్ణం అవటానికి సరైన సమయం కేటాయించలేదని అర్థం. దీని వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మారి, ఇతరేతర సమస్యలకు కారణం అవవచ్చు. 

సరైన సమయంలో రాత్రి భోజనం చేయటం మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని చెప్పవచ్చు. రాత్రి భోజనం త్వరగా చేయటం వలన హార్ట్ స్ట్రోక్ మరియు అటాక్ లు తక్కువగా కలుగుతాయి. ఆలస్యంగా తినటం వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య పెరగటం, శరీరంలో ఇవి వినియోగపడకపోవటం వలన ట్రైగ్లిసరైడ్ లుగా శరీరంలో నిల్వ ఉండి, హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి రోగులను కలిగిస్తున్నాయి.

రోజు రాత్రి ఒకే సమయానికి భోజనం చేస్తూ, ఉదయాన అల్పాహారం తీసుకోవటం వలన మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. భోజనాలను వాయిదా వేయటం వలన మీ శక్తి స్థాయిలు తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అలసట వంటి వాటికి కారణం అవుతుంది. 

రాత్రి త్వరగా భోజనం చేసి పడుకోవటం వలన త్వరగా లేసి వ్యాయామాలు చేసే సమయం కూడా లభిస్తుంది. వ్యాయామాల వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మరియు ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మన అందరికి తెలిసిందే. 

గురక రాకుండా.. మూడు చిట్కాలు

గోళ్ళు కొరుకితే ఇక అంతే

ఎక్కువ కోపం వలన సంబంధాలు చెడిపోతాయి!

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -