Friday, April 19, 2024
- Advertisement -

ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

- Advertisement -

చాలా మంది ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. అలా నిద్రపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది. సరైన సమయం పాటూ పోవాలని తెలిపే సిద్ధాంతాలు లేనప్పటికీ, 7 నుండి 9 గంటల పాటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు, వైద్యులు మరియు పెద్దలు సూచిస్తున్నారు.

9 గంటల కంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఎక్కువ సమయం పాటూ పడుకునే వారికి కొన్ని చెడు వార్తలు కింద తెలుపబడ్డాయి. అతినిద్ర వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

*వయోజన వయసు కలిగిన, కవలపై 2014 సంవత్సరంలో ప్రముఖ సంస్థ పరిశోధనలు జరిపి, అధిక సమయం పాటూ నిద్ర వలన డిప్రెషన్ లకు గురవుతారని తెలిపింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో, 7 నుండి 9 గంటల పాటూ పడుకున్న వారిలో 27 శాతం డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, 9 గంటల కంటే ఎక్కువ సమయం పడుకున్న వారు 49 శాతం, డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది.

*2012లో ఒక అధ్యయనం వారు వృద్ధ మహిళలపై జరిపిన పరిశోధనల ప్రకారం, అతినిద్ర వలన ఆరేళ్ళ కాలంలో మెదడు పనితీరును దెబ్బతీయడం వారు గమనించారు. క్రమం తప్పకుండా తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే మహిళలలో, రెండు సంవత్సరాల కాలవ్యవధితో సమానంగా తమ మెదడు మార్పులు కలగటం పరిశోధకులు గమనించారు.

*“క్యుబెక్” పరిశోధన సంస్థల అధ్యయనం ప్రకారం, రాత్రి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పాటూ పడుకునే వారిలో, టైప్- 2 మధుమేహం లేదా “మల్ఫక్షనింగ్ గ్లూకోజ్ టాలరెన్స్” వంటి వ్యాధులు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు, రాత్రి ఏడు మరియు ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వ్యక్తులు మధుమేహానికి గురయ్యే అవకాశాలు తగ్గాయని, అంతేకాకుండా వారి శరీర బరువు (BMI) ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడిందని పేర్కొన్నారు.

*2012 సంవత్సరంలో, “అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజి” సమావేశంలో సమర్పించిన పరిశోధనల ప్రకారం, రోజు రాత్రి ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయని తెలిపింది. ఈ పరిశోధనలు దాదాపు 3000 మందిపై జరిపారు. రోజు ఎక్కువ సమయం పడుకునే వారు, ఆంజినా వ్యాధికి మరియు 1.1 సార్లు కరోనరీ ఆర్టరీ డిసిజేస్ లకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు ఈ పరిశోధనలలో తేలింది.

తెలివితేటలు వంశపారంపర్యంగా వస్తాయా?

జీలకర్రతో ఇన్ని లాభాలా…? చూస్తే ఆశ్చర్యపోతారు…!

మహిళలు ప్రతిరాత్రీ సెక్స్ కోరుకొంటారా..?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -