Friday, March 29, 2024
- Advertisement -

సగానికి తగ్గనున్న వయసు

- Advertisement -

ముసలి వాళ్లం అయిపోతున్నామని బాధపడుతున్నారా.. అయ్యో ఇక యువతరం ముందు ఎలా నిలబడగలమని ఫీలవుతున్నారా.. నువ్వు పెద్దవాడివి అయ్యారు. నువ్వు చేయలేవు అంటారేమోనని కంగారుగా ఉందా. ఇక ఆ భయాలేవి వద్దు. అనవసరపు ఆందోళనలు కూడా వద్దు. అదిగో వచ్చేస్తోంది. యవ్వన గుళిక. ఒక్క గుళికతో గతించిన యవ్వనం రెక్కలు కట్టుకుంటూ వాలిపోతుంది.

ముసలివారిని పడుచు వారిగా మార్చేందుకు అమెరికాలోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. యవ్వన మాత్రలంటే అదేదో భయపెట్టేలా ఉండదట. జెస్ట్ బలం కోసం మనం వాడే బీ కాంప్లెక్స్ మాత్రలాంటిదట. మానవులు రోజు తినే ఆహారంలో దొరికే 30 రకాల విటమిన్లు, ఖనిజ ధాతువులతో ఈ మాత్రను తయారుచేస్తున్నారు. దీంట్లో విటమిన్ బీ, సి, డి, ఫోలిక్ యాసిడ్ వంటివి కూడా వాడనున్నారు. ఈ మాత్రలు వాడితే ప్రపంచాన్ని వణికిస్తున్న అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రయోగాల్లో భాగంగా సగం మెదడు కణాలు దెబ్బతిన్న ఎలుకలపై చేశారు. ఈ మాత్రలు వేసిన తర్వాత ఎలుకలు మరింత ఆరోగ్యవంతంగా మారాయి. దీంతో వీటిని మరిన్ని ప్రయోగాలతో పరిపుష్టం చేసి మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రయోగం చేసిన ఎలుకల వయసు 22 నెలలు. అంటే మానవుల వయసుతో పోలిస్తే ఇది 70 నుంచి 80 ఏళ్లు అన్నమాట. ఈ మాత్రలు వేసుకున్న ఎలుకల వయసు సగానికి సగం తగ్గింది. అంటే మానవులు ఇది వాడితే తమ వయసులో సగం తగ్గిపోతుందన్నమాట. వయసు తగ్గడం సరే కాని.. అప్పుడెప్పుడో బాపు గారు ఓ కార్టూన్ లో చెప్పినట్లు వయసు తగ్గింది కదాని ఫించన్ లో కోత పెడుతుందేమో ప్రభుత్వం. అది గమనించుకుని మందులు వాడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -