హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

11010
Hero Srikanth family unseen moments
Hero Srikanth family unseen moments

హీరో శ్రీకాంత్ గారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యామిలీ హీరోగా తనదైన నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మేక పరమేశ్వరరావు, ఝాన్సీ గార్లకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.

మేకవారి పాలెం శ్రీకాంత్ గారి స్వస్థలం. కానీ కొన్నేళ్ళకి శ్రీకాంత్ గారి నాన్న పరమేశ్వర రావు గారు కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లారు. శ్రీకాంత్ కూడా గంగావతి లో జన్మించారు. అక్కడే బీకాం వరకు చదువుకున్న శ్రీకాంత్ సినిమా అంటే మక్కువ తో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిప్లమా చేశారు. పీపుల్స్ ఎన్కౌంటర్ అనే చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తాజ్మహల్ చిత్రంతో హీరోగా మారిపోయారు ఇక ఆ తర్వాత తన కెరియర్లో వెనుదిరిగి చూడలేదు.

ఆమె చిత్రంలో తనతో పాటు నటించిన ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్. వీరికి ముగ్గురు పిల్లలు. రోషన్, మేద, రోహన్. తన కెరీర్ లో కానీ పర్సనల్ విషయాల్లో గానీ తన తండ్రి పరమేశ్వర రావు గారు చాలా సపోర్టు అందించాలని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్. అంత సపోర్ట్ ఇచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు. ఆయన మరణంతో శ్రీకాంత్ గారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Loading...