హీరో వెంకట్ గుర్తున్నాడా ? ఇప్పుడేం చేస్తున్నాడంటే ?

1682
Hero Venkat Open Up for Not Getting Movie Offers
Hero Venkat Open Up for Not Getting Movie Offers

హీరో వెంకట్ తెలుగులో దాదాపుగా 15కు పైగా చిత్రాల్లో మంచి ముఖ్యపాత్రలు పోషించాడు. కానీ కథల విషయంలో సరైన అవగాహన లేక ఇతని సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. అయితే ఇటీవలే ఓ ప్రముఖ్య యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో రాణించలేకపోవడానికి కారణం.. ఎవరినీ ఎవరూ తొక్కేయడం, అవకాశాలు రాకుండా చేయడం వంటివి ఉండవని.. టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉంటామని.. తాను ఈ విషయంను బాగా నమ్ముతానని చెప్పాడు. అంతేకాకుండా తాను నటించినటువంటి చిత్రాల్లో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆడలేదని అందువల్లనే తాను హీరో గా రాణించలేక పోయానని చెప్పాడు.

ఇక సినిమాల్లో రాణించలేకపోయిన వెంకట్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ మధ్యకాలంలో ప్రముఖ సోలార్ సంస్థతో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకున్నట్లు గతంలో పలు సందర్భాల్లో తెలిపాడు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, జగపతిబాబు, నందమూరి బాలకృష్ణ తదితర హీరోలతో కలిసి వెంకట్ నటించాడు.

Loading...