Wednesday, April 17, 2024
- Advertisement -

అరెస్ట్ అయితే టిడిపికి లాభమా? నష్టమా?…. బాబు సొంత సర్వే

- Advertisement -

రాజకీయ వ్యూహాల విషయంలో చంద్రబాబు కంటే ముందు చూపున్న ఉన్న నాయకులు చాలా చాలా తక్కువ. ప్రత్యర్థులు అవి వ్యూహాలు కాదు….కుట్రలు, కుతంత్రాలు అని విమర్శిస్తూ ఉంటారు కానీ అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కూడా 2019 ఎన్నికలే లక్ష్యంగా అలాంటి రాజకీయ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు. మోడీ మేనియా వాడుకుని అధికారంలోకి వచ్చాడు. నాలుగే బిజెపితో అధికారం పంచుకున్నాడు. మోడీ నుంచి రావాల్సిన హామీలు రాబట్టలేదు. తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తాను చేసిన ఘనకార్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నాడు చంద్రబాబు.

హోదాతో సహా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని మోడీపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న కోపాన్ని తన ఓట్లుగా మల్చుకోవాలనుకుంటున్నాడు. 2014లో మోడీపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభిమానం పెరిగేలా చేసి….. ఆ అభిమానాన్ని తాను ఓట్ల రూపంలో వాడుకున్నట్టుగానే ఈ సారి 2019 ఎన్నికల సమయానికి మోడీపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోపం, ఆగ్రహం రగిలేలా చేసి ఆ ఆవేశాన్ని తాను ఓట్ల రూపంలో మరల్చుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ వ్యూహాన్ని పసిగట్టిన మోడీ తనను ఎక్కడ అరెస్ట్ చేయిస్తాడో….ప్రజల ముందు విలన్‌గా ఎక్కడ నిలబెడతాడో అన్న భయం బాబును వెంటాడుతోంది. అందుకే ఒకవెళ అరెస్ట్ వరకూ వస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉద్ధేశ్యంతో బాబు సొంత సర్వే చేయించుకున్నాడట. ఆ సర్వే ఫలితాలు బాబును షాక్‌కి గురిచేశాయని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏవైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేయిస్తే సానుభూతి వచ్చే అవకాశం ఉంది కానీ ఓటుకు కోట్లుతో సహా పాత కేసుల్లో అరెస్ట్ జరిగితే మాత్రం ప్రజలు పూర్తిగా పట్టించుకోవడం మానేస్తారని సర్వేలో తేలింది. అది కూడా సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్న ఓటుకు కోట్లు లాంటి కేసుల్లో అరెస్ట్ జరిగితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తాడని గెలిపిస్తే తెలంగాణాలో టిడిపిని అధికారంలోకి తీసుకురావడం కోసం అధికార వ్యామోహంతో రాజకీయాలు చేసి తాను నష్టపోవడంతో పాటు గెలిపించిన ప్రజల ప్రయోజనాలను కూడా నిండా ముంచాడన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే చంద్రబాబుపై ఉన్న పాత కేసులు, స్టేలతో ఉన్న కేసులు, సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్న ఓటుకు కోట్లు లాంటి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయితే మాత్రం అది టిడిపికి కోలుకోలేని దెబ్బ అవుతుందన్న నిజం సర్వేలో తెలిసింది. మోడీ కూడా ఇలాంటి సర్వే చేయించే కెసీఆర్ ద్వారా ఓటుకు కోట్లు కేసులో బాబును బుక్ చేయాలని చూస్తున్నాడా అన్న అనుమానాలు ఇప్పుడు టిడిపి నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -