Wednesday, April 24, 2024
- Advertisement -

తెలంగాణాలో ఎల్లో మాయ చూస్తున్నావా జగన్…. ఎపిలో ఊహించగలవా?

- Advertisement -

తెలంగాణా రాష్ట్రంలో అంతిమ విజేత ఎవరు అనే విషయంలో జాతీయ స్థాయి మీడియాకు కూడా పూర్తి స్పష్టత ఉంది. అయితే తెలంగాణా ఎన్నికల నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠం మాత్రం ఒకటి ఉంది. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న ఇదే మాయ రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ఎన్నో రెట్లు ప్రభావవంతంగా జరుగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణాలో విపక్షాలకు టీఆర్ఎస్‌కి మధ్య ఐదు శాతం పైగా ఓట్లతేడాతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని జాతీయ స్థాయి సర్వే సంస్థలు చెప్తున్నాయి. స్థానికంగా కూడా ప్రజల నోట అవే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే ఒకసారి కాంగ్రెస్‌తో బాబు పొత్తు ఖరారయ్యాక మాత్రం ఎల్లో మీడియా అంతా కూడా కూటమి గెలవబోతోందోచ్ అని టాంటాం చేయడంలో సక్సెస్ అయింది. టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ప్రజలు నిలదీస్తున్నారని విపరీతంగా వార్తలు రాసేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళను తెలంగాణాలో నిలదీస్తున్న తీరు చూసి ఎపి ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎమ్మెల్యేలకు హితోక్తులు చెప్తున్నాడని వార్తలు రాస్తున్నారు. అన్నింటికీ మించి ఏదో జరిగిపోతోంది………కూటమిని చంద్రబాబు గెలిపించబోతున్నాడు అన్న ప్రచారాన్ని ఉధృతంగా చెయ్యడంలో మాత్రం పచ్చ బ్యాచ్, పచ్చ మీడియా సక్సెస్ అయ్యారు. స్వయానా నందమూరి సుహాసిని కూడా ఓడిపోవడం ఖాయం అని జాతీయ స్థాయి సర్వేలు తేల్చి చెప్తుంటే బాబు అండ్ కో మాత్రం తెలంగాణా ప్రజలను మాయ చేయడానికి అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకున్నారు.

రేపు ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు పదింతలు చేస్తారనడంలో సందేహంలేదు. 2014లో కూడా మోడీ-బాబు అభివృద్ధి జోడీ అని, హోదా తెచ్చేది బాబు, ఇచ్చేది మోడీ అని గొప్పగా ప్రచారం చేశారు. ఇక తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ వైకాపా పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా అబద్ధపు ప్రచారం గట్టిగా చేశారు. ఇక విశాఖలో విజయమ్మ గెలిస్తే కడప గూండాలు వచ్చి ఏదో చేస్తారని జనాలను బెదరగొట్టి గెలిచారు. రేపు 2019లో కూడా మోడీతో జగన్‌ని అంటగట్టడం ఖాయం అయింది. ఇంకా అనేక విషయాల్లో అబద్ధపు ప్రచారాలతో రెచ్చిపోతారనడంలో సందేహం లేదు. ఈ సారి అయినా జగన్ ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతాడా? కేవలం మీడియాను, అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును……ఈ ఒక్క విషయంలో దెబ్బకొట్టాడంటే మాత్రం 2019 ఎన్నికల తర్వాత జగనే సిఎం అవ్వడం ఖాయం అని చెప్పడానికి సందేహాలు అక్కర్లేదని నిపుణులైన విశ్లేషకులు కూడా ఘంటాపథంగా చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -