Friday, March 29, 2024
- Advertisement -

జబ్బులతో బాధపడుతున్న నటీనటులు వీరే..!

- Advertisement -

సినీ ప్రముఖులు.. వెండితెరపై అందంగా మరియు బలంగా కనిపించడానికి చాలా వర్కౌట్లు చేస్తుంటారు. అంత మాత్రాన వారు నిజ జీవితంలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు కాదు. ఇలా నిజజీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడిన మరియు బాదపడుతున్న సినీ ప్రముఖుల్ని ఇప్పుడు చూద్దాం.

రజినీకాంత్ :

2011 లో ఎమెసిస్ అనే సమస్యను ఎదుర్కున్నారు. దీంతో శ్వాస నాళముల వాపు చెందడంతో ‘ఐ.సి.యు’ లో కూడా జాయిన్ అయ్యారు. ఇందుకోసం కోసం సింగపూర్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు.

షారుఖ్ ఖాన్ :

షారుఖ్ చాలా కాలం ‘డిప్రెషన్’ లోకి వెళ్లారట. ఓ దశలో సూసైడ్ చేసుకుందా అనుకున్నారట. అయితే నటనపై తనకు ఉన్న ప్రేమే తనని కోలుకునేలా చేసిందని.. కోట్ల మంది ఫ్యాన్స్ ని అలరించేలా చేసింది.

ఇలియానా :

బాడీ డిస్ మార్ఫిక్ డిసార్డర్ కి ఇలియాన గురయ్యిందట. ఒక దశలో సూసైడ్ చేసుకుందాం అనుకుందట. తనకు తనే ధైర్యం చెప్పుకుని ఈ సమస్య నుండి బయట పడిందట.

సోనాలీ బింద్రే :

క్యాన్సర్ తో కొంత కాలం సోనాలి బాధపడిండి. చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్ళి ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కుని మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది.

స్నేహా ఉల్లాల్ :

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో పరిచయం అయిన స్నేహా ఉల్లాల్.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తో బాధపడిందట. ఇది రక్తానికి సంబందించిన ఒక వ్యాదని. దీని వల్లే సినిమా పరిశ్రమకు ఈ భామ దూరమై ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

కమల్ హాసన్ : కమల్ హాసన్ కూడా ‘టైప్ 1 డయాబెటిస్’ తో బాదపడ్డారట. ఈ వ్యాధికి సరైన రీతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. అదుపులో ఉంచుతున్నారట.

నయనతార :

‘స్కిన్ డిసార్డర్’ తో నయన్ బాధపడుతున్నారట. మేకప్ లు వేసుకోవడం వలన తను ఈ డిజార్డర్ కి గురయ్యిందట. ముఖ్యంగా నాన్ వెజ్ తింటే ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందట. దీనికోసం కేరళ వైద్యం తీసుకుంటుందట.

సమంత :

సమంత ‘పాలిమార్ఫస్ కాంతి విస్ఫోటనం’ తో బాధపడుతుందట. ఎండలో కాసేపు ఉంటే.. తన చర్మం ఎర్రబడిపోవడంతో పాటూ దురదలు కూడా మొదలయ్యి బాధిస్తుందట. షూటింగ్ సమయంలో ఈ పరిస్థితి రాకుండా దర్శక నిర్మాతలతో ముందుగానే చెబుతుందట.

సల్మాన్ ఖాన్ :

సల్మాన్ ఖాన్ ‘ట్రిగెమినల్ న్యూరల్జియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడట. ఇప్పటికీ దీని కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడట. ఈ వ్యాధి వలన తీవ్రమైన దవడ నొప్పి, బుగ్గలు బాధించడం వంటివి ఏర్పడేవట. అమెరికా లో ట్రీట్మెంట్ తీసుకుంటుండడంతో చాలా వరకు రికవర్ అయినట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -