Friday, April 26, 2024
- Advertisement -

3 ఎంపిలు, 15మంది ఎమ్మెల్యేలు జంపింగ్‌ ఖాయం…. బాబుతో ఇంటెలిజెన్స్

- Advertisement -

చంద్రబాబు అందచందాలు, గుణగణాలు చూసి వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరూ టిడిపిలోకి వస్తున్నారు. చంద్రబాబు కేక, బాబు అదరహో అంటూ సంబరంగా సెలబ్రేట్ చేసుకున్న పచ్చ బ్యాచ్‌కి ఇప్పుడు అదే సినిమాను చూపిస్తున్నాడు వైఎస్ జగన్. అది కూడా 70ఎంఎంలో, డిటీఎస్ సౌండ్‌తో చూపిస్తున్నాడు. అధికారంలో ఉండడంతో కోట్లాది రూపాయలు, ప్యాకేజీలు, కాంట్రాక్టులు లాంటి ఎట్రాక్షన్స్‌తో, మంత్రి పదవులులాంటి బోనస్‌లతో వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపిలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నమాట వాస్తవం అని ఇప్పటికే ఉండవల్లిలాంటి కుండబద్ధలు కొట్టేశారు. భూమానాగిరెడ్డిలాంటి వాళ్ళ విషయంలో కేసుల భయం కూడా చూపించడం జరిగింది.

అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మాత్రం అలాంటివి ఏమీ చేయకపోయినప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు వైకాపావైపు వస్తున్నారు. జగన్ నాయకత్వానికి మద్దతిస్తున్నారు. కచ్చితంగా జగన్‌పై అభిమానంతోనే వస్తున్నారు అని చెప్పలేం. కానీ ఐదేళ్ళుగా రాజకీయ నాయకుల విషయంలో కూడా అబద్ధపు హామీలు, డ్రామాలతో చేసిన చంద్రబాబు రాజకీయానికి విసుగెత్తిపోయారని మాత్రం చెప్పొచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలేదు. అలాగే చంద్రబాబు విజయం సాధించాలని టిడిపిలో ఉన్న సీనియర్ నాయకులు కూడా కోరుకోవడం లేదు. ఇంకోసారి గెలిస్తే లోకేష్, చంద్రబాబులో అహాన్ని, ఆధిపత్యాన్ని భరించడం మా వళ్ళ కాదు అంటూ టిడిపి నాయకులే వాపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే 2019ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ భారీ మార్జిన్‌తో గెలవడం ఖాయమని ఇప్పటికే జాతీయ స్థాయి మీడియా సంస్థలు, రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని రాజకీయపార్టీలూ నమ్ముతున్నాయి. అందుకే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలాంటి వాళ్ళు కూడా ఎక్కడా వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం లేదు. బిజెపి కూడా విమర్శించడంలేదు. ఎందుకంటే రేపు జగన్‌తో అవసరం వస్తుంది అన్న భావన కేసీఆర్ నుంచి జాతీయ పార్టీల వరకూ అందరికీ ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ముగ్గురు ఎంపిలు, 15మంది ఎమ్మెల్యేలు టిడిపిని వీడడం ఖాయం అని ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ చంద్రబాబుతో ఆ పార్టీ నాయకులకు వణుకు పుట్టిస్తోంది. ఆల్రెడీ ఆయా ఎమ్మెల్యేలు, ఎంపిలను బుజ్జగించడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే బాబు ప్రయత్నాలు, బాబు ఇచ్చిన హామీలను జంపింగ్ నాయకులు కేర్ చేయలేదు. నిన్ను నమ్మం బాబూ……………నమ్మలేం బాబూ అని చంద్రబాబు మొహానే చెప్తున్నారు. అబద్ధపు రాజకీయాలు, మోసపు హామీలతో ప్రజలను మోసం చేసినంత ఈజీగా నాయకులను మోసం చేయడం కష్టం అన్న నిజం చంద్రబాబుకు కూడా తెలిసొస్తోంది. ఎన్నికలు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ఈ సారి పూర్తిగా చేష్టలుడిగిపోయినట్టుగా, ఓటమికి సిద్ధపడిపోయినట్టుగా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు చాణక్యం, పచ్చ మీడియా ప్రచార మాయలు ఈ సారి తెలంగాణా ఎన్నికల్లో లాగే అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం అన్న విశ్లేేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -