Saturday, April 20, 2024
- Advertisement -

ప్రేమ పెళ్లి చేసుకుంటే రూ. 2.5 లక్షలు.. ఎలా ?

- Advertisement -

ప్రస్తుత రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా సర్వసాధరణం అయ్యాయి. అయితే వీటిలో చాలా వరకు కూలాంతర పెళ్లిలే. ప్రేమించి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఇప్పుడు శుభవర్త. ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకున్న వారికి రెండున్నర లక్షలు నజరానా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. గతంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు ఇచ్చేవారు. కాకపోతే అప్పుడు కేవలం 50 వేల రూపాయలు మాత్రమే ఉండేది.

ఇప్పుడు మాత్రం ఆ డబ్బుకు ఐదు రేట్లు ఎక్కువగా అంటే.. రెండున్నర లక్షల రూపాయలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ డబ్బు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లవ్ మ్యారెజ్ కచ్చితంగా కులాంతర ప్రేమ పెళ్లై ఉండాలి. ఒకే కులంలో ప్రేమ వివాహం చేసుకున్న వారికి ఈ ప్రోత్సాహం లభించదు. అంతేకాకుండా వధూవరుల్లో ఎవరో ఒకరు కచ్చితంగా ఎస్సీ అయి ఉండాలి.

ఒకవేళ బీసీలు,ఇతర కులాల వారు ప్రేమ వివాహం చేసుకుంటే.. బీసీ కార్పోరేషన్ ప్రోత్సాహకం ఇస్తోంది. కుల వ్యవస్థ మహమ్మారిని రూపుమాపడంతో పాటు ఎస్సీలను జనజీవనంలోకి తీసుకొచ్చేందుకు ప్రొత్సాహం పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇలా ప్రేమించి ప్రేమ మైకంలో లైఫ్ లో సెటిల్ కాకముందే ప్రేమ వివాహం చేసుకుంటే చాలా ప్రమాదం. ప్రేమించుకున్న వారు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవడం చాలా మంచింది. తెలుసుకోని ముందు అడుగు వేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -