Friday, March 29, 2024
- Advertisement -

జగన్, కేటీఆర్‌లకంటే అసమర్థుడిని అని నువ్వే నిరూపిస్తే ఎలా అంటూ బాబుపై లోకేష్ ఆగ్రహం

- Advertisement -

తెలంగాణాలో కెటీఆర్ ముఖ్యమంత్రి పదవికి వారసుడిగా చాలా తొందరగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ చంద్రబాబు కుమారుడిగానే మిగిలిపోయిన లోకేష్‌కి కెటీఆర్‌తో పోల్చుకోవడం అలవాటు. జగన్‌తో పోటీపడలేకపోయినప్పటికీ కేటీఆర్ కంటే సమర్థుడిని అని మాత్రం లోకేష్ ఫీలవుతూ ఉంటాడు. అందుకే తెలంగాణాలో కెటీఆర్ చేపట్టిన మంత్రి పదవులే తనూ చేపట్టాడు. అఫ్కోర్స్ కెటీఆర్ ప్రజలను మెప్పించి వాళ్ళ ఓట్లతో గెలిచి మంత్రి అయ్యాడు. కానీ లోకేష్ మాత్రం దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని దొడ్డిదారి ప్రధాని అని ఎద్దేవా చేసిన చంద్రబాబే తన కొడుకును అదే దొడ్డిదారిన మంత్రిని చేశాడు. అలాగే ట్విట్టర్‌లో కూడా కేటీఆర్‌లాగే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కేటీఆర్‌కి ప్రశంశలు మిగులుతూ ఉంటే లోకేష్‌కి మాత్రం ట్రోలింగ్‌లు, ఎటకారాలు, తిట్లు, విమర్శలు మిగులుతున్నాయి.

లోకం అంతా ఎలా అనుకున్నా కనీసం చంద్రబాబు కూడా లోకేష్‌ని నాయకుడిగా నమ్మకపోవడం ఇప్పుడు లోకేష్‌కి ఆగ్రహం తెప్పించిందని టిడిపి సీనియర్ నాయకులు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఓవైపు కేసీఆర్ మాత్రం అన్ని ఎన్నికల్లోనూ ప్రధాన ప్రచారకర్తగా కేటీఆర్‌నే ముందు నిలుపుతున్నాడు. కానీ చంద్రబాబు మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో మాత్రం లోకేష్‌ని పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బట్టీ పట్టిన ప్రచారాలతో వంద సీట్లు ఖాయం అని ప్రచారం చేసి చివరికి టిడిపిని ఆల్మోస్ట్ డకౌట్ చేసిన లోకేష్ ప్రతిభ దెబ్బకు జడుసుకున్న చంద్రబాబు ఆయన సన్నిహితులైన ఇద్దరు మీడియాధిపతులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లోకేష్‌ని ప్రచారానికి పంపకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే లోకేష్‌కి ఆగ్రహం తెప్పిస్తోందట. నన్ను అసమర్థుడు అని మీరే ముద్రవేస్తారా అని ఆవేశంగా రియాక్ట్ అవుతున్నాడట. చివరకు బాలకృష్ణను కూడా పంపిస్తున్నారు. నన్ను మాత్రం ఇంటికే పరిమితం చేస్తున్నారు అని వాపోతున్నాడని అధినేత కుటుంబంతో సన్నిహితంగా ఉండే టిడిపి నాయకులు చెప్తున్నారు.

రోజాలాంటి వాళ్ళు పప్పు, మొద్దబ్బాయి అంటూ ఎద్దేవా చేయడానికి ఇదే కారణం అని లోకేష్ నమ్ముతున్నాడు. అయితే లోకేష్ ఆవేధన ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం ఎన్నికల క్షేత్రంలో లోకేష్ లెగ్, ప్రచారం వద్దని కరాఖండీగా నాయకులతో చెప్పేస్తున్నాడట. మరి రేపు 2019లో ఎపిలో జరిగే ఎన్నికల్లో కూడా లోకేష్‌ని ఇంటికే పరిమితం చేస్తారా? అయినా సొంత కొడుకు నాయకత్వ సమర్థతపై తండ్రికే నమ్మకం లేకపోతే ఇక ప్రజలు ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్నలకు టిడిపి జనాలు ఏం సమాధానం చెప్తారు? ఐరన్ లెగ్ అని ఎంత ముద్రవేసుకున్నా, మొద్దబ్బాయి అనిపించుకున్నా కూడా ఏదో ఒక తాపత్రయంతో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీలాగే లోకేష్‌ని కూడా ప్రజాక్షేత్రంలోకి పంపడమే మంచిదని చంద్రబాబుకు సన్నిహితులైన నాయకులు సలహాలు ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -