Saturday, April 20, 2024
- Advertisement -

ఆ వెయ్యి కోట్లు పోయాయన్న బాధే పచ్చ పార్టీని వేధిస్తోందా?

- Advertisement -

వాడుకుని వదిలేయడం పెద్దబాబు నైజం. అయితే ఇప్పుడు అలా వాడుకుని వదిలెయ్యడమే కాకుండా……..ఆ వదిలేసిన తర్వాత వాళ్ళు సర్వనాశనం కావాలి అనే రేంజ్‌లో కక్ష్య సాధింపు రాజకీయాలు చేయడంలో పెదబాబు, చినబాబులిద్దరూ ఇంకాస్త పట్టుదలగా ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, నరేంద్రమోడీ అయితేనేమి…..ఇద్దరూ కూడా సర్వనాశనం కావాలని బలంగా కోరుకుంటున్నారు. పవన్‌కి వ్యతిరేకంగా పూనంకౌర్, కత్తి మహేష్, శ్రీరెడ్డిలాంటి వాళ్ళతో పచ్చ మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ పవన్ కళ్యాణ్ పచ్చ బ్యాచ్ ఊహించనివిధంగా ‘బట్టలిప్పుకుందాంరా’ అంటూ ఎదురుదాడికి దిగి పచ్చ బ్యాచ్ అరాచకీయాలను బట్టలూడదీసి రోడ్డుపై నిలపడంతో ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.

ఇక నరేంద్రమోడీని కూడా ఎలా అయినా దెబ్బకొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, సీమాంధ్రులను రోడ్డుపైన పడేసిన కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు ఇద్దరు బాబులు. జగన్‌ని జైలుకు పంపించడంలో సాయపడినందుకు కృతజ్ఙతగానో ఏమో తెలియదు కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలా వెయ్యి కోట్ల అవినీతి సొమ్ము పంపించారు. ఇక బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని చెప్పి మహేష్ కత్తితో పాటు ఆరడుగుల బుల్లెట్టు లాంటి వాళ్ళను సొంత ఖర్చులతో కర్ణాటక పంపించారు. అయితే ఆ ప్రచారం, వ్యూహాలు ఏవీ వర్కౌట్ కాలేదు. బిజెపి గెలిచింది. తెలుగు వాళ్ళు ఉన్న చోట కూడా బిజెపి గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సీట్లు గెల్చుకుంది. అయితే పచ్చ పార్టీ నేతలు, పచ్చ మీడియా మాత్రం బిజెపిది నైతిక విజయం కాదు, తెలుగు వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేయబట్టే మెజారిటీ దక్కించుకోలేకపోయింది అని కొత్త ప్రచారం మొదలెట్టారు.

అసలు విషయం ఏంటా అని ఆరాతీస్తే వెయ్యి కోట్ల రూపాయల అక్రమ సొమ్ము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, బిజెపిని ఓడించడానికి ఖర్చుపెట్టారని తెలుస్తోంది. ఇక చినబాబు, పెదబాబుల మాటలు నమ్మి కర్ణాటకలో కాస్త బలంగా ఉన్న పచ్చ పార్టీ సానుభూతిపరులయిన వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్ గెలుపు కోసం భారీగా ఖర్చుపెట్టారట. అయితే ఇప్పుడు కాంగ్రస్ పూర్తిగా బొక్క బోర్లా పడడంతో ఆ మొత్తం డబ్బులు పోయాయన్న బాధతోనే పచ్చ నేతలు ఆక్రందనలు వినిపిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో సొంత డబ్బులు ఖర్చు చేసిన కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ఆంధ్రప్రదేశ్‌లో ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ భారం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే పడుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -