Friday, April 19, 2024
- Advertisement -

లోకేష్ పోటీకి సేఫ్ ప్లేస్ ఎక్కడా..? లోకేష్ పోటీయే చేయారా….?

- Advertisement -

మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి రాద‌ని తెలిసినా ప‌ట్టు వ‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడుతున్నారు. పార్టీ త‌రుపున పోటీ చేసే గెలుపు గుర్రాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించారు. అయినా ఓట‌మి భ‌యం బాబును వెంటాడుతోంది. బాబు జ‌రిపించుకున్న అంత‌ర్గ‌త స‌ర్వేల్లో కూడా వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా పోల్ మేనేజ్ మెంట్ చేసి గెల‌వ‌గ‌లిగిన బాబుకు…. త‌న పుత్ర‌ర‌త్నం లోకేష్ విష‌యంలో మాత్రం ఆందోళ‌న‌లో ఉన్నారంట‌.

పేరుకు సీఎం కొడుకు అయినా రాజ‌కీయా ప‌రిజ్ణానం మాత్రం అంతంత మాత్ర‌మే. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌ని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు బాబు. మంత్రి అయిన త‌ర్వాత లోకేష్‌లో మార్పు వ‌స్తాద‌నుకున్న బాబు ఆశ‌ల‌కు తిలోద‌కాలిచ్చారు . వైఎస్ జ‌గ‌న్‌, కేటీఆర్‌లాగా రాజ‌కీయాల్లో పోటీ ప‌డలేక పోతున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో ఎలా మాట్లాడాలో కూడా క‌నీస ప‌రిజ్ణానం లేకుండా మాట్లాడుతున్నారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కోచింగ్ ఇచ్చినా చిన‌బాబులో చెప్పుకోద‌గ్గ మార్పులేక‌పోవ‌డంతో ఇక లాభం లేద‌నుకొని బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

మొద‌ట్లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో లోకేష్‌ను పోటీ చేయించాల‌ని బాబు భావించినా ఇప్పుడు మాత్రం త‌న నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి ఎన్నిక‌ల్లో లోకేష్ పోటీ చేయ‌ర‌ని స‌మాచారం. 175 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో లోకేష్ కోసం షేఫ్ స్థానం ఒక్క‌టీ కూడా లేదంట‌. త‌న అంత‌ర్గ స‌ర్వేల్లో కూడా లోకేష్ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా గెల‌వ‌డ‌నే ఫ‌లితం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

గ‌తంలో కుప్పం నియోజ‌క వ‌ర్గాన్ని కొడుక్కు ఇచ్చి…బాబు క‌ర్నూలు జిల్లానుంచి పోటీ చేస్తార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ప్ర‌య‌త్నాన్ని కూడా విర‌మించుకున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ బ‌ల‌మైన స్థితిలో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక్క సీటు ఓడినా కూడా అది పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూప‌డంతో పాటు… లోకేష్ రాజకీయ జీవితం కూడా ప్రమాదంలో ప‌డ‌నుంద‌ని బాబు భ‌య‌ప‌డుతున్నారంట‌. మ‌రో వైపు కుప్పం సీటును కూడా వ‌దులుకొనే ప‌రిస్థితుల్లోకూడా బాబ లేరంట‌. దీంతో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో లోకేష్ పోటీ చేయ‌ర‌నే స‌మాచారం పార్టీ వ‌ర్గాల‌నుంచి వ‌స్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -