Saturday, April 20, 2024
- Advertisement -

జాను మూవీ యంగ్ రామ్ గా నటించింది ఎవరంటే ?

- Advertisement -

సమంత అక్కినేని, శర్వానంద్ కాంబినేషన్లో వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాను. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంటూ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. జాను తమిళ్ మూవీ 96 రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మనం ఇప్పుడు ఈ సినిమాలో యంగ్ శర్వానంద్ గా నటించిన యాక్టర్ గురించి తనకి ఈ ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం.

జానులో యంగ్ శర్వానంద్ గా నటించిన అబ్బాయి పేరు సాయి కిరణ్ కుమార్. బీటేక్ పూర్తి చేశాడు. అసలు సినిమా ఫీల్డ్ అంటే పరిచయం లేని కుటుంబం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే దిల్ రాజు గారి బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. జాను మూవీలో యంగ్ శర్వానంద్ కారెక్టర్ కోసం యాక్టర్స్ కావాలనే ప్రకటనను సాయి కుమార్ అక్క చూసి అప్లే చేయమని చెప్పిందట.

అప్లై చేసిన కొన్ని డేస్ కి కాల్ రావడం రెండు ఆడిషన్స్ కు అటెండ్ అయ్యి సెలక్ట్ అయ్యాడట సాయికిరణ్. లైఫ్ లో ఇండస్ట్రీకి యాక్టింగ్ వైపు వస్తానని అనుకోలేదట సాయి కిరణ్. మొదటి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం.. పెద్ద బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సాయికిరణ్. ఇంకా తెలుగులో మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ సాయి కిరణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -