Friday, April 19, 2024
- Advertisement -

నిహాంత్ గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు..!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ షోకి పోటీగా వేరే చానల్స్ కామెడీ తరహా షోస్ ని తీసుకు వచ్చిన జబర్దస్త్ ముందు ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాయి. మల్లెమాల ప్రొడక్షన్స్ ఈ జబర్దస్త్ కామెడీ షో ప్రొడ్యూస్ చేస్తుంది.

జబర్దస్త్ నటులు దీని ద్వారా సినిమాలలో అవకాశాలు అందుకోవడం తో పాటు ఈవెంట్స్ ద్వారా కూడా బిజీబిజీగా గడిపేస్తున్నారు. జబర్దస్త్ లో అందరి టీం ఒక ఎత్తు అయితే రాకింగ్ రాకేష్ టీం ఒక ఎత్తు అని చెప్పాలి. పెద్దవాళ్ళతో స్కీట్ చేయించడం ప్రాక్టీస్ చేయడం అనేది ఈజీ. కానీ చిన్న పిల్లలతో చేయడం అంటే అది ఎంత కష్టమైన పనో వేరే చెప్పక్కర్లేదు. కానీ రాకింగ్ రాకేష్ పిల్లలతో స్కిట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. రాకేష్ టీంలో మెయిన్ గా యోదా, నిహంత్, దీవేన ఈ ముగ్గురు పిల్లలు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే మనం ఇప్పుడు నిహంత్ గురించి.. తన ఫ్యామిలీకి గురించి తెలుసుకుందాం. నిహంత్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లో. అమ్మ లక్ష్మీ, నాన్న మూర్తి. మూడు సంవత్సరాల వయసు నుండే సినిమా డైలాగులు చెబుతూ ఉండే వాడట నిహంత్. నిహంత్ కు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి తో కలిసి ఒక షూటింగ్ కి వెళ్తే అక్కడ నిహంత్ ను చూసిన సీరియల్ డైరెక్టర్ రసూల్ గారు యాక్టింగ్ చేస్తవా అని అడగడం దానికి నిహంత్ ఫ్యామిలీ ఓకే చెప్పడంతో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన శ్రీనివాస కళ్యాణం సీరియల్ తో నిహంత్ యాక్టింగ్ కెరీర్ మొదలైంది.

ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు గారు ఒక ఈవెంట్ లో నేహంత్ చూసి తన సీతా మహాలక్ష్మి సీరియల్ లో ఏ క్యారెక్టర్ లేకపోయినా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నిహంత్ కు అవకాశం ఇచ్చారట. ఆ షూటింగ్ టైమ్ లోనే నాగబాబు గారి తో నిహంత్ కి మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ టైంలో రాకేష్ కి నాగబాబు గారికి ఫోన్ చేసి నిహంత్ గురించి చెప్పడంతో నిహంత్ జబర్దస్త్ ఎంట్రీ అలా మొదలైంది. ఏ స్కీట్ లోనైన తన ముద్దు మాటలతో ప్రతి సీన్ ని చాలా మంచిగా చేస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు జబర్దస్త్ కొనసాగిస్తున్నాడు.

జబర్దస్త్ లోనే కాకుండా సినిమాలలోనూ సీరియల్స్ లోను ఈవెంట్స్ లోను పాల్గొంటూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు నేహంత్. ఒకవైపు చదువు చక్కగా చదువుకుంటున్నాడు. స్కూల్, షూటింగ్ ను నేహంత్ అమ్మగారు చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. ఇలాగే నేహంత్ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కెరీర్ లో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -