Saturday, April 20, 2024
- Advertisement -

బాధ్యత కాదు పవన్….. ఐదేళ్ళ పాటు ఐదు కోట్ల సీమాంధ్రులను మోసం చేసిన పాపం

- Advertisement -

చేసిన తప్పు గురించి తెలుసుకున్నాడనుకుందామా? లేకపోతే ప్రజల్లోకి వెళితే నిగ్గదీసి అడుగుతారని ముందు జాగ్రత్తపడ్డాడని అనుకుందామా? రెండో విషయమే రైట్. 2014లో స్టార్ హోటల్‌లో పార్టీ స్థాపించి విభజన అంతా అయిపోయాక సీమాంధ్రులకు సానుభూతి మాటలు చెప్పాడు. ఆవేధనలో ఉన్న సీమాంధ్రులకు పవన్ లాంటి నట రాజకీయ నాయకుడి మాటలు గొప్పగా అనిపించాయి. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్‌కి రాజకీయాల్లో నటించడం పెద్దగా చేతకాకపోయింది. కానీ ఒక సారి రాజకీయ నటన విషయంలో ప్రపంచానికే పాఠాలు చెప్పగలిగిన నిప్పుతో జత కట్టాక, ఆ నిప్పు భజన మీడియా అంతా పవన్ చుట్టూ చేరాక సినిమాల్లో కంటే గొప్పగా నటించాడు పవన్. బాధలో ఉన్న సీమాంధ్రులను గొప్పగా నమ్మించాడు. చంద్రబాబు, మోడీలకు ఓటెయ్యండి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను ప్రశ్నిస్తా, పోరాడతా అంటూ ఆవేశంగా డైలాగులు చెప్పాడు. రాజగురువు ట్రైనింగ్ గొప్పగా వర్కౌట్ అయినట్టుంది. త్రివిక్రమ్‌లాంటి డైరెక్టర్స్‌కి కూడా పవన్ చేత గొప్పగా నటింపచెయ్యడం చేతకాలేదు కానీ నిప్పు వారి రాజగురువులు మాత్రం పవన్ చేత అద్భుతంగా నటింపచేశారు. ఆ నటనకు తోడు అబద్ధపు హామీలు, భజన మీడియా బాజాలు కలిసొచ్చి చంద్రబాబుకు సిఎం కుర్చీ దక్కేలా చేశాయి.

రైతు రుణమాఫీపైనే మొదటి సంతకం అన్న చంద్రబాబు…… రైతులను దారుణంగా మోసం చేస్తూ రుణమాఫీపై కమిటీ వేస్తున్నానని చెప్పాడు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్‌కి ఏ ప్యాకేజీలు అందాయో తెలియదు కానీ మౌనంగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత నుంచీ పవన్ డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు. మోడీ, చంద్రబాబుల కంటే గొప్ప రాజకీయం చేశాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటాడు. బిజెపి ఎంపిలను, బంట్రోతు స్థాయి నాయకులను విమర్శిస్తాడు. మోడీని మాత్రం పల్లెత్తు మాట అనడు. ఇక చంద్రబాబుని విమర్శించడానికి అయితే పవన్‌కి మరీ మొహమాటం. మొత్తానికి మూడున్నరేళ్ళు మాటలతో, ట్వీట్లతో, గట్టిగా నాలుగు సభలతో సరిపెట్టాడు. మూడున్నరేళ్ళలో పట్టుమని పది రోజులు కూడా ప్రజల మధ్యన ఉన్నది లేదు. ఇప్పుడిక 2019 ఎన్నికల కోసం రెడీ అయ్యాడు. అది కూడా పాతిక కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్న ‘అజ్ఙాతవాసి’ షూటింగ్ అయిపోయాకనేననుకోండి. ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో దిగడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా వైఎస్ జగన్ పాదయాత్రను తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా బాబుతో భజన మీడియా రచించిన వ్యూహంలో భాగంగానే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. పేజీలకు పేజీలు పవన్ వదిలిన పత్రాల్లో ఎక్కడైనా చంద్రబాబు తప్పులు ప్రస్తావించాడా? అది చాలదా పవన్‌ని ఎవరు పంపిస్తున్నారో చెప్పడానికి. కాకపోతే 2009 నుంచీ పవన్ రాజకీయాలు చూస్తున్న జనాలు ఇప్పుడు పవన్ పైన కూడా కోపంగా ఉన్నారు. మూఢాభిమానుల విషయం పక్కనపెడితే సామాన్యులు మాత్రం పవన్‌ని కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఆ విషయం తెలుసుకాబట్టి చంద్రబాబు పాలనా వైఫల్యాల్లో తనకూ భాగం ఉందని చెప్పాడు. అది కూడా చంద్రబాబు పేరు ఎత్తకుండా చాలా లౌక్యంగా మాట్లాడాడు. కాకపోతే ఎదుటి వారి తప్పుల దగ్గరకు వచ్చేసరికి ‘పంచెలూడగొట్టండి’ అనే పవన్ తన పాపాల దగ్గరకు వచ్చేసరికి ‘బాధ్యత’ అని చాలా చిన్న పదం వాడాడు. కానీ పవన్‌ది నిస్సందేహంగా పాపం. అసలే అన్నీ నష్టపోయిన సీమాంధ్రులను మరో ఐదేళ్ళపాటు దగా చేయడానికి మోడీ, బాబులకు సహకరించిన పాపం పవన్‌దే. ఒక్కరిని మోసం చేస్తేనే, బాధపెడితేనే పాపం అంటాం. మరి ఐదు కోట్లమంది సీమాంధ్రులను ఐదేళ్ళపాటు మోసం చేస్తే ఏమనాలి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -