Saturday, April 20, 2024
- Advertisement -

జియో దసరా ఆఫర్ ఏంటో తెలుసా..?

- Advertisement -

రిలియన్స్ జియో.. టెలికాం రంగంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే దసరాను పురస్కరించుకుని.. “జియో పై” 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. జియో ఫైను రూ. 999కే అందిస్తున్నట్లు తెలిపింది.

రూ. 1999 ధర ఉన్న ‘జియో ఫై’ పరికరంపై వెయ్యి రూపాయల తగ్గింపును ఇస్తున్నామని.. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ఉంతుందని రిలయన్స్ జియో పేర్కొంది. 4జీ ఫోను లేకపోయినా.. 4జీ డేటా స్పీడ్ తో పాటుగా, కాలింగ్ సదుపాయాలు కూడా పొందొచ్చని ప్రకటించింది. అంతేకాకుండా.. మీకు నచ్చిన జోటుకు తీసుకెళ్లి.. 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్‌లలో జియో 4జీ సేవలను పొందవచ్చు. కుటుంబ సభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బంది జియో డిజిటల్ లైఫ్‌కి అనుసందానం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వైఫై పరికరాలను జియో ఫైతో అనుసందానం చేసుకోవచ్చు. ప్రతీ జియో పైతో ఒక జియో సిమ్ వస్తోంది. ఆ పరికరంలో సిమ్ వేసిన తర్వాత అది వైపై హాట్ స్పాట్ లా పని చేస్తోంది.

ఆ తర్వాత ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్ యాక్టివేట్ అవగానే జియో ఫై ద్వారా ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, 4జీ డేటా సేవలను పొందవచ్చు. మీరు కాల్ చేసిన వ్యక్తికి మీ 10 అంకెల ‘జియో ఫై’ నంబరు కనపడుతుంది. తిరిగి ఆ వ్యక్తి మీ నంబరుకు కాల్ చేయవచ్చు. ‘జియో ఫై’ పరికరాలు అన్ని రిలయన్స్ జియో రిటైల్ స్టోర్లతో పాటు జియో వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ పెర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -