Friday, April 19, 2024
- Advertisement -

జియో యూజర్స్ కి బ్యాడ్ న్యూస్.. చూడండి..!

- Advertisement -

టెలికాం రంగంలో పలు మార్పులు వస్తున్నాయి. మొదట్లో ఫ్రీ కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించిన జియో.. ఇప్పుడు ఈ సదుపాయంను తొలిగించింది. ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ కు నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఊహించినట్లుగానే దీనికి వినియోగదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

అయితే గతంలో ఈ సంవత్సరం ఆఖరి నుంచి ఐయూసీ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రాయ్.. ఇప్పుడు దాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జీరో ఐయూసీ చార్జీలు జనవరి 2021 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టమైంది. కాబట్టి జియో వినియోగదారులు మరో సంవత్సరం పాటు ఈ ఐయూసీ చార్జీలను చెల్లించక తప్పదు.

అయితే జియో పక్కన పెడితే.. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ వినియోగదారుల నుంచి ఐయూసీ చార్జీలను వసూలు చేయడం లేదు. కాబట్టి వారి వినియోగదారులు తాము ఎంచుకునే ప్లాన్లను బట్టి అన్ లిమిటెడ్ ఉచిత కాలింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు. జియో ప్లాన్లు ఇతర నెటవర్క్ లకన్న మెరుగ్గా ఉన్నప్పటికి అత్యంత కీలకమైన కాల్స్ విషయంలో జియో అన్ లిమిటెడ్ ను అందించకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఐయూసీ చార్జీలను నిలిపివేస్తుందో.. అప్పుడే తాను కూడా ఐయూసీ చార్జీలను సేకరించడం ఆపేస్తానని జియో ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి మరో సంవత్సరం పాటు జియో వినియోగదారులు ఈ చార్జీలను చెల్లించక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -