ఫ్రెండ్ లా భార్యతో చాటింగ్ చేసి కోటి నొక్కన భర్త..!

650
Karimnagar Man Frauds His Wife And Tooks Money With Cheating
Karimnagar Man Frauds His Wife And Tooks Money With Cheating

ప్రపంచంలో మనుషులు ఏం చేయడానికైన రెడీ అయిపోతున్నారు. బయట వారినే కాదు ఇంట్లో వాళ్లనే.. తమను నమ్ముకున్న వారినే మోసం చేస్తున్నారు. గచ్చిబౌలిలో ఊహించని కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్ పేరుతో భార్యతో చాట్ చేయడం మొదలు పెట్టి చివరికి భార్య దగ్గర నుంచి కోటి రూపాయలు లాగేశాడు ఓ భర్త.

విషయంలోకి వెళ్తే.. గచ్చిబౌలికి చెందిన ఒక మహిళకి కరీంనగర్‌ లో ఉంటున్న సంతోష్ తో మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయింది. ఇద్దరు ఒకే కులం కావడం వల్ల ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరు పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత ఆమె ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లింది. ఇక్కడే ఉన్న భర్త సంతోష్ కుమార్ తన అవసరాల నిమిత్తం ఏవేవో చెబుతూ రూ.63 లక్షలు భార్య నుంచి తీసుకున్నాడు. ఇవే కాక తన స్నేహితుడి పేరు అయిన సత్యహర్ష రెడ్డి అనే పేరుతో సదరు భార్య మొబైల్, మెయిల్‌కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపేవాడు.

ఫ్రెండ్ పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమె తన భర్త పైన అనుమానం వచ్చి గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది. భర్త సంతోష్ కుమారే, సత్యహర్ష రెడ్డి అనే పేరుతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపినట్టు తేలింది.సత్యహర్ష పేరుతో భార్యని ఇబ్బందులకు గురి చేసిన సంతోష్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి దగ్గర నుంచి అరెస్ట్ చేసే వరకూ దాదాపు రూ.కోటి రూపాయలు తన భర్త తన నుంచి తీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ యాక్సెఫ్ట్ చేస్తే మీ పని ఫట్..!

‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ గురించి నిజాలు..!

వాలంటీర్‌తో పంచాయతీ కార్యదర్శి ఎఫైర్.. రెండో పెళ్లికి రెడీ.. ఇంతలో ఏమైందంటే ?

సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు..!

Loading...