Thursday, March 28, 2024
- Advertisement -

బెంజ్ కారు కొన్న కార్తిక దీపం హీరోయిన్.. రేటు ఎంతంటే ?

- Advertisement -

ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రెటింగ్ తో దూసుకెళ్తోంది కార్తిక దీపం సీరియల్. ఇందులో నటించిన ప్రేమీ విశ్వనాధ్ ఇప్పుడు బాగా ఫేమస్. ఈమె దీపక్క గా, వంటలక్కగా బాగా పాపులర్ అయింది. బుల్లితెరమీద 742ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది ఈ సీరియల్.

దీపక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు అనే చిన్న పాయింట్ మీదా సీరియల్ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వంటలక్క సినిమాలో కూడా నటిస్తోంది. మలయాళంలో శాల్మర్ అనే మూవీలో రాజీవ్ విక్రమ్ తో కల్సి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కన్నడంలో సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి,పలు గేమ్ షోస్ లో పాలుపంచుకుంది.

అయితే ఈమె తాజాగా కారు కొన్నది. షూటింగ్ అయ్యాక పర్సనల్ విషయాలను ఫేస్ బుక్ లో షేర్ చేసే వంటలక్క తాజాగా కారు గురించి కూడా ఫోటో షేర్ చేసింది. తన ఇంటిలోకి న్యూ మెంబర్ వచ్చాడని క్యాప్షన్ ఇచ్చింది. దాదాపు 60లక్షలతో కొనుగోలు చేసిన ఈ కారు కి సంబంధించి లక్కీ నెంబర్ కూడా తీసుకుందట. ఈ లక్కీ నెంబర్ కోసం కూడా బానే ఖర్చు చేసిందంట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -