Saturday, April 20, 2024
- Advertisement -

కేసీఆర్ భ‌జ‌న చేస్తున్న ఆ రెండు మీడియా సంస్థ‌లు.. ఎందుకంటే?

- Advertisement -

ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి అధికారం చేజిక్కుంచుకొని సీఎం కుర్చీని ఆదిష్టించిన కేసీఆర్‌… ఇప్పుడు త‌న వాళ్లేవ‌రు.. ప‌గ‌వాళ్లేవ‌రు అనే లెక్క‌లు తవ్వి తీసే ప‌నిలో బీజీగా ఉన్నార‌ని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయ‌న రెండు మీడియా హౌజ్‌ల‌పై దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నాడు, ఆంధ్ర‌జ్యోతి మీడియా హౌజ్‌ల ప‌ని ప‌ట్టేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల మాట‌.

2014 నుంచి 2018 మొద‌ట వ‌ర‌కు సరిగ్గా చెప్పాలంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగుపెట్టేంత వ‌ర‌కు ఈ రెండు ప‌త్రిక‌లు కేసీఆర్‌కు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రించాయి. ఆయ‌న తానా అంటే తందానా అన్నాయి. కానీ తెలంగాణ ఎన్నిక‌ల్లోకి చంద్ర‌బాబు ఎంట్రీతో సీన్ రివ‌ర్స్ అయింది. అప్ప‌టివ‌ర‌కు కేసీఆర్ భ‌జ‌న చేసిన ఈ రెండు ప‌త్రిక‌లు త‌మ అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాయి. చంద్ర‌బాబుకు అనుకూలంగా వార్త‌లు రాస్తూ.. కేసీఆర్ ఓట‌మి త‌థ్యం అంటూ చిత్రిక‌రించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేశాయి. దీంతో కేసీఆర్‌కు ఈ ప‌త్రిక‌ల అస‌లు స్వ‌రూపం తెలిసొచ్చింది. కానీ తానొక‌టి త‌లిస్తే.. దైవ‌మొక‌టి త‌లిచిన‌ట్టు.. కేసీఆర్ మ‌ళ్లీ తెలంగాణ సీఎం కావ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి వ‌చ్చాయి ఈ రెండు ప‌త్రిక‌లు.

మొన్న‌టివ‌ర‌కు తిట్టి పోసి ఒకేసారి పొగిడితే బాగుండ‌ద‌నుకున్నారేమో.. మెల్లిమెల్లిగా త‌మ స్వ‌రాన్ని మారుస్తున్నాయి. దీనంత‌టికి కార‌ణం ఎంటంటే.. ఐ అండ్ పీఆర్‌కు సంబంధించిన పోర్ట్‌పోలియోను కేసీఆర్ త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. దీంతో యాడ్స్, వాటికి చెల్లించాల్సిన మొత్తాన్ని కేసీఆర్ డైరెక్ట్‌గా నిర్ణయిస్తున్నారు. ఇటీవ‌ల ఈ రెండు సంస్థ‌లు స‌మ‌ర్పించిన ప్ర‌పోజ‌ల్స్‌ను కేసీఆర్ తిర‌స్క‌రించార‌ని స‌మాచారం. దీంతో మ‌రోసారి కేసీఆర్‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నాయి ఈ రెండు సంస్థ‌లు. ఈనాడు ఓ అడుగు ముందుకు వేసి ప‌క్కా తెలంగాణ యాస‌లోనే హెడ్డింగ్‌లు పెట్ట‌డం ప్రారంభించేసింది ఈ మ‌ధ్య‌. ఆంధ్ర‌జ్యోతి మాత్రం ఇంకా లోక్‌స‌భ ఎన్నిక‌లు ఉన్నాయి కాబ‌ట్టి.. టెంప‌ర‌రీ కంటే అస‌లు స్వామి భ‌క్తినే ఎక్కువ ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఒక‌సారి దెబ్బ‌తిన్న కేసీఆర్ మ‌రోసారి వీటిని న‌మ్ముతారా? లేదా? అనేది కాల‌మే నిర్ణ‌యించాలి. ఏదేమైనా అస‌లు వార్త తెలుసుకోవాలంటే ఓ మూడు, నాలుగు పేప‌ర్లు, ఛాన‌ల్స్ చూస్తే త‌ప్ప అర్థం కాని ప‌రిస్థితి సామాన్య జ‌నానిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -