Friday, March 29, 2024
- Advertisement -

తిండిపై ఒక లుక్ వేస్తున్నారా… లేకపోతే వేయండి

- Advertisement -

మనం తీసుకొనే ఆహారమే మనకు హాని చేస్తుందని పరిశోదకులు అంటున్నారు. అసలు ఆహారం హాని చేయటం ఏమిటి?

అనే అనుమానం మీకు వస్తుందా. అనుమానం రావటం సహజమే. అయితే తీసుకొనే ఆహారం ద్వారానే డిప్రెషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

పిజ్జాలు,బర్గర్స్,కూల్ డ్రింక్స్ వంటివి డిప్రెషన్ కి కారణం అవుతాయట. దాదాపుగా 1000 మంది మీద పరిశోదన చేసి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. ఫాస్ట్ ఫుడ్ తీసుకోని మహిళల్లో కన్నా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్న మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనపడ్డాయి.

అంతేకాక తీపి పదార్దాలు,నూనె పదార్దాలు ఎక్కువగా తీసుకొనే మహిళల్లో కూడా డిప్రెషన్ కనపడింది. మనం తీసుకొనే ఆహారం పట్ల కొంచెం శ్రద్ద పెడితే మంచిదని నిపుణులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -